సీనియర్ హీరో రాజశేఖర్ కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరాను ఫేస్ చేయబోతున్నారు. గరుడవేగతో రీఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కల్కి సినిమాలో నటించిన రాజశేఖర్.. దాదాపు మూడేళ్ల విరామం తీసుకున్నాడు. కపటధారి చిత్రానికి ముందు ఆయనే హీరోగా ఎంపికయ్యాడు కానీ.. తర్వాత ఏవో కారణాలతో దాన్నుంచి తప్పుకున్నాడు. ఆపై వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అనుకున్న సినిమా కూడా పట్టాలెక్కలేదు.
కొన్ని నెలల కిందట కరోనా బారిన పడి ఒక దశలో విషమ స్థితిని ఎదుర్కొని, తర్వాత కోలుకున్న రాజశేఖర్.. ఇప్పట్లో సినిమాలు చేస్తాడా అనుకున్నారు కానీ.. కొంచెం గ్యాప్‌లో మూడు సినిమాలు అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడాయన. ఆ మూడు సినిమాల్లో శేఖర్ కూడా ఒకటి. మలయాళ హిట్ మూవీ జోసెఫ్‌కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం నెరిసిన జుట్టు, ముడతలు పడ్డ ఛర్మంతో డీగ్లామరస్ అవతారం ఎత్తాడు రాజశేఖర్. లలిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పుడు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో రాజశేఖర్‌కు జోడీగా మలయాళ హీరోయిన్ అను సితారను ఓకే చేశారు. ఈ సినిమాలో హీరో కూతురి పాత్ర కూడా చాలా కీలకం. దాని కోసం జార్జిరెడ్డి ఫేమ్ ముస్కాన్‌ను ఓకే చేసినట్లు తెలిసింది.
ఎంఎల్వీ సత్యనారాయణతో కలిసి రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన దీని ఒరిజినల్ జోసెఫ్ మలయాళంలో మంచి విజయం సాధించింది. మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ మూవీ రాజశేఖర్‌కు బాగానే సెట్టయ్యే అవకాశముంది.
This post was last modified on June 9, 2021 6:42 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…