బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. నేషనల్ అవార్డు దక్కించుకున్న ఇతడికి ఎందరో అభిమానులున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో తన ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సిరీస్ సీజన్ 2 మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తనకు కొత్తతరం ఫ్యాన్ బేస్ ను అందించిందని చెబుతున్నారు మనోజ్.
చాలా మంది తారలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. తమ క్రేజ్ తగ్గిపోతుందేమోనని, ఓటీటీ హీరోలనే ముద్ర పడిపోతుందేమోనని వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ ఓ సలహా ఇచ్చారు మనోజ్ బాజ్ పాయ్. ఓ నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ మంచి అవకాశం ఇస్తుందని చెప్పారు. డిజిటల్ ప్రేక్షకులు ప్రయోగాలు కోరుకుంటున్నారని.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దంటూ చెప్పుకొచ్చారు.
వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో లీనమై నటించారు. ఈ పాత్రే తనను కొత్త తరానికి పరిచయం చేసిందని మనోజ్ అన్నారు. ఈ తరం వారికి గతంలో తను నటించిన సినిమాలు తెలియవని.. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారి మాత్రమేనని అన్నారు టీనేజ్ పిల్లలు తన దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతున్నారని.. గతంలో తనకు ఈ రకం ఫ్యాన్ బేస్ లేదని.. ఫ్యామిలీ సిరీస్ కారణంగా తనకు కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
This post was last modified on June 8, 2021 1:49 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…