ఒకప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలా మంది అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది భూమిక. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో వదిన, అక్క క్యారెక్టర్లు చేస్తూ బిజీగా అయింది. బాలీవుడ్ లో కూడా ఈ తరహా పాత్రలు పోషిస్తూ మెప్పిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె బిగ్ బాస్ షోలో కనిపించబోతుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్ 15 కోసం కంటెస్టెంట్ గా భూమికను సంప్రదిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా వీటిపై స్పందించింది భూమిక. ఇదొక ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని చెప్పింది. గతంలో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 సమయంలో తనను కంటెస్టెంట్ గా సంప్రదించారని.. ఆ తరువాత కూడా అడిగారని కానీ ప్రతిసారీ తిరస్కరిస్తూ వచ్చానని స్పష్టం చేసింది. అయితే ఈసారి తనను ఎవరూ సంప్రదించలేదని.. ఒకవేళ ఆఫర్ చేసినా.. తను మాత్రం ఒప్పుకోనని తెగేసి చెప్పింది. తను పబ్లిక్ పర్సనాలిటీ అయినప్పటికీ.. తన లైఫ్ ప్రైవేట్ అని.. 24 గంటలు తనపై కెమెరాలు ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసిన విషయమే. హౌస్ లో జరిగే ప్రతి సంఘటన, సంభాషణలు కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంటాయి. పైగా ఈ మధ్యకాలంలో హిందీ బిగ్ బాస్ షోలో గొడవలు, రొమాన్స్ డోస్ బాగా ఎక్కువైంది. సౌత్ బిగ్ బాస్ షోతో పోలిస్తే హిందీ షోలో వ్యవహారాలు కాస్త ఘాటుగా మారాయి. అందుకే చాలా మంది తారలు ఈ షోలోకి పార్టిసిపేట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇక భూమికకు తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం నచ్చదు. అందుకే ఈ షోని రిజెక్ట్ చేస్తూ వచ్చింది.
This post was last modified on June 6, 2021 2:41 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…