అవకాశం ఇస్తామని వేధించే అలవాటు అన్ని రంగాల్లో ఉన్నా.. సినీ రంగానికి సంబంధించిన వారి నోటి నుంచి వస్తే.. అవి కాస్తా సంచలనంగా మారుతుంటాయి. గతానికి భిన్నంగా ఈతరం నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని.. షాకింగ్ వేధింపుల్ని బయటపెట్టేందుకు ఏ మాత్రం సంకోచించటం లేదు. సినిమాల్లో అవకాశాలు కోసం కాల్ సెంటర్ లో పని చేస్తూ తానేమిటో నిరూపించుకున్న ముద్దుగుమ్మ జరీన్ ఖాన్.
సల్మాన్ తో వీర్ మూవీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత హౌజ్ ఫుల్ 2.. హేట్ స్టోరీ 3, ఆక్సర్ 2తో పాటు.. టాలీవుడ్ లో గోపీచంద్ తో చాణక్య మూవీ చేసిన జరీన్ ఖాన్.. స్క్రీన్ మీద అందాల ప్రదర్శనకు సై అంటారు. అలా అని అవకాశం కోసం దారుణాలకు నో అంటే నో అనేస్తారు. తన కెరీర్ మొదట్లో.. తనకు ఎదురైనషాకింగ్ అనుభవాన్ని ఆమె వెల్లడించారు.
అయితే.. తనను ఇబ్బంది పెట్టిన సదరు సినీ ప్రముఖుడి పేరును మాత్రం ఆమె రివీల్ చేయలేదు. బాలీవుడ్ కు వచ్చిన కొత్తల్లో తనకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడని.. తనకు మించిన మంచోడు లేడన్నట్లుగా వ్యవహరించేవాడని చెప్పారు. తనకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. ఆ సినిమాలో ముద్దు సీన్ ఉంటుందని.. దాన్ని ముందే మనం రిహార్సల్ చేద్దామని తనను పిలిపించినట్లు చెప్పారు.
అలా తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడన్నారు. మనసులోని భయాన్ని పక్కన పెట్టు.. అంటూ సదరు డైరెక్టర్ తనతో దారుణంగా ప్రవర్తించేవాడన్నారు. తనను దారిలోకి తెచ్చుకోవటానికి అనేక విధాలుగా ప్రయత్నించేవాడని.. తన సినిమా ఆఫర్ల విషయాన్ని కూడా తాను చూస్తానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. తాజాగా ఆమె చెప్పిన ఈ విషయాలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరన్న ఆరా జరీన్ మాటలతో మొదలైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates