బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకి భారీ ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈసారి పాల్గొనే కంటెస్టెంట్ లలో నటి రియా చక్రవర్తి కూడా ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో కోసం కొంతమంది సెలబ్రిటీల లిస్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో రియా చక్రవర్తి కూడా ఉన్నారట. బాలీవుడ్ లో నటిగా సినిమాలు చేస్తోన్న సమయంలో సుశాంత్ రాజ్ పుత్ తో ప్రేమ, ఆ తరువాత అతడు సూసైడ్ చేసుకోవడం వంటి విషయాలతో రియా వార్తల్లో నిలిచింది.
సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ వ్యవహారానికి దారి తీయడంతో ఈ కేసులో రియాను అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైలులో ఉంచారు. ఆ తరువాత ఆమె బయటకు వచ్చినప్పటికీ.. గతేడాది కాలంగా ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షో కోసం ఆమెని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఆమె గనుక అంగీకరిస్తే ఈసారి షో మరింత రసవత్తరంగా సాగడం ఖాయం. కానీ ఈ విషయంలో రియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మరోపక్క రియా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈమెకి టాలీవుడ్ లో కొంత మంది హీరోలతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఇక్కడి వారికి ఫోన్లు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తుందట. ఇప్పట్లో ఆమెకి బాలీవుడ్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే తెలుగులో ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ఈమె ‘తూనీగ తూనీగ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రియాకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె ముంబైకి వెళ్లిపోయింది.
This post was last modified on June 5, 2021 2:29 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…