మామూలుగా హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో బోల్డ్‌గా కనిపించి ఒక స్థాయి అందుకున్నాక గ్లామర్ డోస్ తగ్గిస్తుంటారు. ఇక పెళ్లి చేసుకున్నాక సినిమాలు మానేసేవాళ్లు కొందరైతే.. వివాహం తర్వాత సినిమాలు చేసినప్పటికీ గ్లామర్ షోలు చేయకుండా కొంచెం ట్రెడిషనల్‌గా ఉండే రోల్సే చేస్తుంటారు. కానీ సమంత మాత్రం ఇందుకు భిన్నం. సమంత రూత్‌ప్రభుగా ఉన్నప్పుడు సామ్ ఒక స్థాయిని మించి గ్లామర్ విందు చేసింది లేదు. కానీ సమంత అక్కినేనిగా మారాక ఆమె బోల్డ్ రోల్స్‌తో వరుసగా షాకులు ఇస్తోంది. ‘రంగస్థలం’లో లిప్ లాక్ సీన్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఐతే అది నిజం ముద్దు కాదని, కెమెరా ట్రిక్ అని చెప్పినా జనాలందరికీ ఆ విషయం చేరలేదు.
ఇక తమిళంలో పెళ్లి తర్వాతే చేసిన ‘సూపర్ డీలక్స్’లో సమంత పాత్రను చూసి చాలామంది షాకయ్యారు. అందులో పెళ్లయ్యాక తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో శారీరక సంబంధం పెట్టుకునే పాత్రలో ఆమె కనిపించడం గమనార్హం. మామూలుగానే స్టార్ హీరోయిన్లు ఇలాంటి రోల్స్ చేయరు. అలాంటిది పెళ్లయిన హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం షాకే. ఐతే ఇప్పటిదాకా సమంత చేసిన బోల్డ్ యాక్ట్స్ అన్నీ ఒకెత్తయితే.. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో రాజీ పాత్రలో కనిపించిన విధానం మరో ఎత్తు. ఇందులో సమంత మీద ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్ తీశారు. అందులో ఆమె బ్రాతో కనిపిస్తుంది. సెక్స్‌లో పాల్గొంటుంది. తర్వాత బ్రా మీదే అతడి మీద ఎటాక్ చేస్తుంది.
ఇక సిరీస్ చివర్లో వచ్చే ఒక సీన్ అయితే మరీ బోల్డ్ అనే చెప్పాలి. అందులో శృంగార సన్నివేశాన్ని బయటికి చూపించరు కానీ.. ఆ పాత్ర వ్యవహరించే తీరులో చాలా ‘బోల్డ్‌నెస్’ ఉంటుంది. ఆ సీన్ సిరీస్ మొత్తంలో సెన్సేషనల్ అని చెప్పొచ్చు. ఇక్కడ దాని గురించి మాట్లాడితే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ చూడాలనుకున్న ప్రేక్షకులు థ్రిల్ మిస్ కావచ్చు. ఐతే అది చూసిన వాళ్లకు మాత్రం షాకింగ్‌గా అనిపిస్తుంది. ఇంత బోల్డ్‌గా ఉన్న పాత్రను సమంత అంగీకరించడం సాహసమే. సమంతకు పెళ్లయిన కొత్తలో ఆమె కొంచెం హాట్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేస్తే అక్కినేని అభిమానులు తనపైకి దండెత్తారు. ట్రోల్ చేశారు. కానీ సమంత వాళ్లకు దీటుగా బదులిచ్చింది. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు సమంతకు ఇలాంటి వేధింపులు తగ్గినట్లే ఉన్నాయి.
This post was last modified on June 5, 2021 2:09 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…