Movie News

ఫ్యామిలీ మ్యాన్-2.. నెవర్ బిఫోర్

ఇండియన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో వెబ్ సిరీస్‌ల రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి రెడీ అయినట్లే ఉంది ‘ఫ్యామిలీ మ్యాన్-2’. ఈ సిరీస్ మీద ఉన్న అంచనాలు, దీనికున్న క్రేజ్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఒక వెబ్ సిరీస్ కోసం, అందులోనూ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. మామూలుగా క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాల మీద మాత్రమే అంచనాలుంటాయి. వాటి కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఫస్ట్ట్ డే ఫస్ట్ షో ఫీవర్‌తో ఊగిపోతుంటారు. తొలి రోజు రికార్డుల గురించి చర్చ నడుస్తుంటుంది.

ఒక వెబ్ సిరీస్ విషయంలో ఇలాంటి యుఫోరియా ‘ఫ్యామిలీ మ్యాన్-2’ విషయంలో మాత్రమే చూస్తున్నాం. ఒకప్పుడు వెబ్ సిరీస్‌లను కేవలం యూత్ మాత్రమే చూసేవాళ్లు. కానీ గత రెండేళ్లలో ఓటీటీ విప్లవం పుణ్యమా అని ఫ్యామిలీస్ కూడా వీటిని బాగా ఆదరిస్తున్నాయి.

లాక్ డౌన్ టైంలో అమేజాన్ ప్రైమ్ ఇంటింటికీ వెళ్లిపోయింది. అందులోని ఒరిజినల్స్,‌లో ప్రేక్షకులు తప్పక చూసిన వాటిలో ‘ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. ఉత్కంఠకు ఉత్కంఠ.. అలాగే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్లతో ఈ సిరీస్ చాలా బాగా ఆకట్టుకుంది. తొలి సీజన్ అయినప్పటి నుంచి రెండో సీజన్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ టైంలో కొంచెం లేటుగా ఈ సిరీస్ చూసిన వాళ్లలోనూ అదే ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే చాలా ఆలస్యమై, వివాదాలను దాటుకుని గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమ్ కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కోసం ఒకేసారి కోట్ల మంది అమేజాన్ ప్రైమ్ తెరవడం గ్యారెంటీ. కచ్చితంగా ఫస్ట్ డే వ్యూస్ విషయంలో ఈ సిరీస్ కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం. ట్రాఫిక్ ఎక్కువై సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. మిగతా వెబ్ సిరీస్‌ల మాదిరి తీరిగ్గా కొన్ని రోజుల పాటు ఎపిసోడ్లు చూసే మాదిరి ప్రేక్షకులు ఈ సిరీస్ విషయంలో చేయకపోవచ్చు. ఒక్క రోజులో అన్ని ఎపిసోడ్లనూ లాగించేయడానికే చూడొచ్చు. ఓ వెబ్ సిరీస్‌కు ఇలాంటి క్రేజ్ నెవర్ బిఫోర్ అనడంలో సందేహం లేదు.

This post was last modified on June 4, 2021 8:13 am

Share

Recent Posts

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

7 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

7 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

8 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

8 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

9 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

10 hours ago