Movie News

ప‌వ‌న్ కోసం సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. రాజ‌కీయాల్లో కొన‌సాగుతూనే.. కాస్త వీలు చేసుకుని చ‌క‌చ‌కా కొన్ని సినిమాలు చేసేయాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే కేవ‌లం 30 రోజుల కాల్ షీట్లు ఇచ్చి వ‌కీల్ సాబ్ సినిమాను పూర్తి చేయాల‌ని టార్గెట్ పెట్టుకున్నాడు. క్రిష్ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువ క‌ష్ట‌ప‌డ‌టానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ రెండు చిత్రాల్ని ఈ ఏడాదే పూర్తి చేయాల‌న్నది ప‌వ‌న్ ప్లాన్.

అంతా అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే ఈపాటికి వ‌కీల్ సాబ్ రిలీజ్ కూడా అయి ఉండాల్సింది. కానీ క‌రోనా వ‌చ్చి ప‌డి అన్ని ప్ర‌ణాళిక‌ల్ని నాశ‌నం చేసింది. మ‌ళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌దు. మొద‌ల‌య్యాక వ‌కీల్ సాబ్‌కు సంబంధించి అయితే వారం ప‌ది రోజుల పాటు ప‌వ‌న్ ప‌ని చేస్తే స‌రిపోతుంది.

ఆ త‌ర్వాత క్రిష్ సినిమా కోసం కొంచెం గ‌ట్టిగా ప‌ని చేయాల్సి ఉంటుంది ప‌వ‌న్. మ‌ళ్లీ షూటింగ్స్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఏం చేయాల‌నే విష‌యంలో చిత్ర బృందం ప‌క్కా ప్రణాళిక‌తో రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. చారిత్ర‌క నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం నార్త్ ఇండియాకు వెళ్లాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది.

ఎలాంటి స‌న్నివేశాలైనా స‌రే.. రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్స్ వేసుకుని అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌ని.. అలా కాకుంటే సినిమా చాలా లేటైపోతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు క్రిష్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ క‌లిసి ఫిలిం సిటీలో ప‌ర్య‌టించి కొన్ని ప్రాంతాల్ని ఎంచుకుని.. అక్క‌డ ఎలాంటి సెట్లు వేయాలో ప్లాన్ గీసేశార‌ట‌. మ‌ళ్లీ షూటింగ్స్ ఆరంభ‌మ‌య్యాక ప‌వ‌న్ కొన్ని రోజులు వ‌కీల్ సాబ్ కోసం ప‌ని చేస్తాడు. ఈ గ్యాప్‌లో సెట్లు తీర్చిదిద్దుకునే ప‌నిలో ప‌డుతుంది క్రిష్ టీం. త‌ర్వాత ప‌వ‌న్ రాగానే వేగంగా షూటింగ్ చేయాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌.

This post was last modified on May 16, 2020 11:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

39 minutes ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

50 minutes ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

2 hours ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

2 hours ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

3 hours ago