నటుడు అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి సినిమాలతో ఇతడి క్రేజ్ మరింత పెరిగింది. తన సినిమాలకు తనే కథలు రాసుకుంటూ ఉంటారు ఈ హీరో. యూత్ లో అడివి శేష్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తరచూ సినిమా అప్డేట్స్ తో వార్తల్లో నిలిచే ఈ హీరో తొలిసారి తన లవ్ లైఫ్ గురించి మాట్లాడారు. గతంలో ఈ హీరో బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటిపై అడివి శేష్ స్పందించలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం తను ప్రేమలో ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయిని చాలా కాలంగా ప్రేమిస్తున్నట్లు చెప్పిన అడివి శేష్ ఆ అమ్మాయి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. తన వ్యక్తిగత విషయాలను పబ్లిక్ గా చెప్పడానికి సిద్ధంగా లేనని.. ఈ విషయంలో ఇంకా తన ప్రేయసి పర్మిషన్ కూడా తీసుకోలేదని.. తనతో చర్చించిన తరువాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తానని చెప్పారు.
ప్రేమలో ఉన్నప్పటికీ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పారు. కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నానని.. పడుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదని.. ఇలాంటి సమయంలో కొత్త బాధత్యలు తీసుకోలేనని చెప్పారు. ప్రస్తుతం ఈ హీరో మహేష్ బాబు ప్రొడక్షన్ లో ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే ‘హిట్’ సినిమా సీక్వెల్ లో, ‘గూఢచారి’ సీక్వెల్ లతో బిజీగా ఉన్నారు.
This post was last modified on June 3, 2021 3:58 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…