18 పేజెస్.. యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ, మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇది సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన సినిమా కావడంతో ముందు నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది.
‘18 పేజెస్’ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ చివరగా తీసిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రానికి కూడా సుక్కునే స్క్రిప్టు అందించాడు. ఆ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ‘18 పేజెస్’ కూడా ఆ కోవలోకే చేరుతుందన్న అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మిగతా వాటి కంటే సుక్కు బ్రాండే పెద్ద ఎసెట్ అనడంలో సందేహం లేదు. మరి ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో యూత్‌కు నచ్చేలా ‘కుమారి 21’ స్క్రిప్టును తీర్చిదిద్దిన సుక్కు.. ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం సుకుమార్ ఈసారి కథ విషయంలో మరీ కొత్తగా ఏమీ ట్రై చేయట్లేదట. అప్పట్లో తరుణ్ నటించిన ‘ప్రియమైన నీకు’ తరహా కథనే కొంచెం భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశాడట సుక్కు. హీరోకు అనుకోకుండా ఒక అమ్మాయి డైరీ దొరకడం.. దాన్ని చదువుతూ ఆమె వ్యక్తిత్వానికి హీరో ఫిదా అయిపోవడం.. ఆధునికతకు దూరంగా జీవనం సాగించే ఆమెను వెతికి పట్టుకోవడానికి హీరో చాలా కష్టపడటం.. ఈ క్రమంలో నడిచే కథ ఇదని తెలిసింది.
ఓవరాల్‌గా చూస్తే కథ చాలా పాతదిగా అనిపించినప్పటికీ.. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందని, సుక్కు మార్కు చమత్కారం, చిలిపితనం దీనికి జోడించారని.. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ స్టైలిష్‌గా ‘18 పేజెస్’ను తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది అల్లు అరవింద్, బన్నీ వాసు కావడంతో వాళ్ల బ్రాండ్ కూడా తోడై సినిమా మంచి విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి.
This post was last modified on June 2, 2021 6:33 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…