టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. మొదటి నుంచి కూడా సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకుంటూ తన ప్రతిభను చాటుతున్నారు. ‘రంగస్థలం’ సినిమా తరువాత సుకుమార్ క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు సుకుమార్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ పక్క దర్శకుడిగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూనే మరోపక్క సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు.
కొన్ని నెలల ముందు వరకు సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ అనే వ్యక్తి సుకుమార్ రైటింగ్స్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. కానీ రీసెంట్ గా ఆయన మరణించారు. దీంతో ఈ బ్యానర్ కు కొత్త మ్యానేజర్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సుకుమార్ తన భార్య తబితను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మూడేళ్లక్రితం తబిత ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో డ్రై క్లీనింగ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా గతేడాది నుండి ఈ వ్యాపారం కాస్త డల్ గా నడుస్తోంది.
అందుకే తబిత కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ గైడెన్స్ లో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నిఖిల్ నటిస్తోన్న ’18 పేజెస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఆయన ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వచ్చే ఏడాది వరకు ఆయన బిజీగా ఉంటారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా తీసే ఛాన్స్ ఉంది!
This post was last modified on June 2, 2021 6:06 am
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…