Movie News

‘కేజీఎఫ్2’ లేటెస్ట్ అప్డేట్!

కన్నడ హీరో యష్ ని స్టార్ హీరోగా చేసింది ‘కేజీఎఫ్’ సినిమా. దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ సినిమా సెకండ్ చాప్టర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు కానీ ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. మొదటి చాప్టర్ లో ముఖాలు చూపించకుండా కొన్ని క్యారెక్టర్ లను సస్పెన్స్ గా ఉంచారు. ఇప్పుడు రెండో చాప్టర్ లో ఆ పాత్రలను రివీల్ చేయనున్నారు.

సినిమా రిలీజ్ కు ముందు ఒక్కో క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్స్ ను రివీల్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నారు. ఈరోజు మరో పోస్టర్ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలో బాలకృష్ణ అనే నటుడు కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. పేపర్ కట్టింగ్స్ తో ఉన్న ఈ పోస్టర్ లో.. ఇనాయత్ ఇండియాలో గుర్తుతెలియని ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని క్యాప్షన్ ఉంది.

దుబాయ్ లో ఉంటూ నరాచీను దక్కించుకోవాలనుకునే డాన్ గా ఇనాయత్ ఖలీల్ రోల్ ఉండబోతుంది. ఇంతకీ ఈ పాత్రలో కనిపిస్తోన్న బాలకృష్ణ ఎవరో తెలుసా..? బిగ్ బాస్ సీజన్ 2 తో పాపులారిటీ దక్కించుకున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తండ్రే ఈయన. ఈ కుటుంబంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మంచి బంధం ఉంది. అందుకే సినిమాలో పవర్ ఫుల్ పాత్ర కోసం బాలకృష్ణను తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రావు రమేష్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు.

This post was last modified on May 31, 2021 11:58 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago