ప్రధానే మమతను వెయిట్ చేయించారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి-సీఎం మమతబెనర్జీ మధ్య పరిస్దితులు వాతావరణం రోజు రోజుకు మరింతగా దిగజారిపోతున్నాయి. యాస్ తుపాను బాధిత ప్రాంతాలను చూడటానికి పశ్చిమ బెంగాల్ వచ్చిన నరేంద్రమోడిని మమతబెన్జీరీ 30 నిముషాల పాటు వెయిట్ చేయించారనే వార్తలపై సీఎం మండిపోయారు. తనకు వ్యతిరేకంగా కావాలనే అబద్ధాలను ప్రధానమంత్రి కార్యాలయం ప్రచారం చేస్తోందన్నారు.

ప్రధాని బసచేసిన చోటుకు తాను, ప్రధాన కార్యదర్శి వెళ్ళినట్లు ఆమెచెప్పారు. అయితే తమను మోడిని కలవనీయకుండా 20 నిముషాల పాటు పీఎంవో ఉన్నతాధికారులు నిలిపేసినట్లు ఆరోపించారు. తాను ప్రధానిని వెయిట్ చేయించటం కాదని తననే మోడి వెయింట్ చేయించారని ఆమె చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఓ అధికారి వచ్చి మోడి కాన్ఫరెన్సు హాలులో ఉన్నారని చెప్పి తమను తీసుకెళ్ళినట్లు మమత తెలిపారు.

అయితే అక్కడ బీజేపీ ఎంఎల్ఏలు, నేతలతో మోడి మాట్లాడుతున్నది చూసి తాను ఆశ్చర్యపోయాయనన్నారు. ప్రధానమంత్రి సమీక్షంటే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు ఉండాలి కానీ ప్రతిపక్ష బీజేపీ ఎంఎల్ఏలు, నేతలుండటం ఏమిటంటే గట్టిగానే నిలదీశారు. గుజరాత్ , ఒడిస్సాలో పర్యటించనపుడు బెంగాల్లో చేసినట్లే బీజేపీ లేదా ప్రతిపక్ష ఎంఎల్ఏలు, నేతలతో మోడి సమావేశమయ్యారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

మొదటినుండి బెంగాల్ విషయంలో నరేంద్రమోడి కక్షసాధింపుగానే వ్యవహరిస్తున్నారంటు నిప్పులుచెరిగారు. మూడోసారి ఎన్నికల్లో తాను గెలివటాన్ని మోడి సహించలేకపోతున్నట్లు మమత ఎద్దేవాచేశారు. అప్పటినుండే కేంద్రప్రభుత్వం తనను తీవ్రంగా అవమానిస్తోందని ఆరోపించారు. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా మమత ఈ సందర్భంగా గుర్తుచేశారు. మొత్తంమీద మోడి-మమత మధ్య పరిస్దితులు రోజురోజుకు క్షీణిస్తోందన్న విషయం స్పష్టమైపోతోంది. మరి ఈ వివాదాలు చివరకు ఎక్కడికి దారితీస్తాయో.