‘అ!’ లాంటి ప్రయోగాత్మక సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత కల్కి, జాంబి రెడ్డి డిఫరెంట్సి మూవీస్ తీసిన తీసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తాజాగా ‘హనుమాన్’ అనే సోషియో ఫాంటసీ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇదే తొలి సూపర్ హీరో సినిమా అని ప్రశాంత్ అంటున్నాడు. ఐతే కొన్ని దశాబ్దాల కిందటే సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘సూపర్ మ్యాన్’ అనే సినిమా రావడం ప్రశాంత్‌కు తెలిసి ఉండకపోవచ్చు.
ఐతే తన సినిమాలకు ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చుకుంటూ ప్రశాంత్‌కు మొదట్నుంచి ఇలా ఘనమైన ప్రకటనలు ఇవ్వడం అలవాటే. నిజానికి అతడి తొలి మూడు చిత్రాల్లో పూర్తి స్థాయిలో ఏదీ ప్రేక్షకులను మెప్పించలేదు.
‘అ!’ మూవీని మంచి ప్రయోగంగా పేర్కొన్నవాళ్లూ ఉన్నారు. అదే సమయంలో అదొక వేస్ట్ మూవీ అన్న వాళ్లూ లేకపోలేదు. ‘కల్కి’ అయితే పూర్తిగా నిరాశకు గురి చేసింది. ‘జాంబి రెడ్డి’ మిక్స్‌డ్ ఫీలింగ్ ఇచ్చింది. మరి భారీ బిల్డప్‌తో అనౌన్స్ చేసిన ‘హనుమాన్’ సంగతేంటో చూడాలి. ఇంతకీ ప్రశాంత్ చెబుతున్న ప్రకారం తెలుగులో తొలి సూపర్ హీరోగా కనిపించబోయే నటుడెవరన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
కొన్ని రోజుల కిందట ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే తన కొత్త సినిమాను ప్రకటించనున్నానని, అదొక డిఫరెంట్ జానర్లో చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని.. ఐతే ఈ చిత్రానికి హీరో ఇంకా ఖరారవ్వలేదని.. సినిమా ప్రకటించే సమయానికి ఏ స్టార్ హీరో ఖాళీగా ఉంటే ఆ హీరోతో చేస్తానని.. లేదంటే కొత్త హీరోతోనే ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు. ఐతే నిజానికి ఇప్పుడు ప్రశాంత్‌కు ఏ స్టార్ హీరో కూడా దొరకట్లేదని.. ‘జాంబిరెడ్డి’ హీరో తేజ సజ్జానే ఈ చిత్రంలో లీడ్ రోల్‌కు ఓకే అయ్యాడని.. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేయనున్నారని అంటున్నారు. ఓ మోస్తరు బడ్జెట్లోనే ఈ సినిమా తీయడానికి ప్రశాంత్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.
This post was last modified on May 29, 2021 11:00 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…