జగపతి బాబును తలుచుకోగానే.. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కే గుర్తుకొస్తుంది అందరికీ. హీరో వేషాలు పక్కన పెట్టేసి విలన్, క్యారెక్టర్ రోల్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఆ లుక్కే మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తున్నారు. ఆయన్ని చివరగా ఎప్పుడు క్లీన్ షేవ్ లుక్‌తో చూశామో కూడా జనాలకు గుర్తు లేదు. కొన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్‌లో గడ్డం తగ్గించి.. జుట్టుకు, గడ్డానికి రంగేసుకుని కనిపించారు కానీ.. క్లీన్ షేవ్‌లో మాత్రం గత కొన్నేళ్లలో ఎప్పుడూ కనిపించింది లేదు.
ఐతే ఇప్పుడాయన గడ్డం తీసేసి సరికొత్త లుక్‌లోకి మారారు. ఏడేళ్ల తర్వాత తాను క్లీన్ షేవ్ చేసుకున్నది ఇప్పుడే అంటూ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ కొత్త లుక్‌లో జగపతిబాబును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం, కనీసం ఇంకో నెల రోజులు చిత్రీకరణలు పున:ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో గడ్డం తీసేయడానికి జగపతికి ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు. ఏడేళ్లుగా గడ్డం మెయింటైన్ చేస్తున్నాడంటే.. బహుశా ‘లెజెండ్’ సినిమా కోసం విలన్ అవతారం ఎత్తి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి మారాక జగపతి ఎప్పుడూ క్లీన్ షేవ్ చేయలేదన్నమాట.
‘లెజెండ్’ సినిమాలో పాత్ర, లుక్ ఆయనకు భలేగా కలిసొచ్చి ఆయన తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన కొనసాగుతున్నారు. మరి ఈ క్లీన్ షేవ్ లుక్ చూశాక రైటర్లు, డైరెక్టర్లకు కొత్త ఆలోచనలొచ్చి ఆయన కోసం మరింత విభిన్నమైన పాత్రలు ఇస్తారేమో.. హీరోగా కూడా ఆయన సినిమాలేమైనా చేస్తారేమో చూడాలి.
This post was last modified on May 29, 2021 7:57 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…