తెలుగు సినిమా ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు బ్రహ్మాజీ. సరికొత్త పాత్రలు, మేనరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రకరకాల పాత్రలు పోషించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేయగలిగాడు. చాలా కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోన్న ఆయన కొన్నాళ్లక్రితం ‘హ్యాంగ్‌మ్యాన్’ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా వదిలారు.
ఈ ఫస్ట్ లుక్ లో చేతిలో పెద్ద చేప పట్టుకొని.. కాస్త నెరసిన జుట్టుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు బ్రహ్మాజీ. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు డబ్బింగ్ పనులు షురూ చేశారు. బ్రహ్మాజీ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి పంపించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా సినిమాకు బజ్ తీసుకురావాలని భావిస్తున్నారు.
ఆ తరువాత సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థతో డీల్ కుదుర్చుకోవాలని చర్చలు జరుపుతున్నారు. క్రైమ్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాను నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. కథ ప్రకారం.. బ్రహ్మాజీ తలారి పాత్రను పోషిస్తున్నారు. క్లోరో ఫిలిం పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో విహాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
This post was last modified on May 29, 2021 4:30 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…