ఒకే ఒక్క సినిమాతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన జెనీలియా… ఆ తర్వాత ఒకే ఒక్క తప్పటడుగుతో ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇవ్వాలని తెగ తహతహలాడుతోంది జెనీలియా. కెరీర్ టాప్‌లో ఉన్నప్పుడు దిగిన లొకేషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ… తెలుగు హీరోలను తెగ పొగుడుతోంది.
మొన్న ‘ఢీ’ సినిమా టైమ్‌లో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన జెన్నీ… తాజాగా ‘రెఢీ’ మూవీ షూటింగ్‌లో హీరో రామ్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ… అదో గొప్ప అనుభవం అని… రామ్ తనకు మంచి స్నేహితుడని ట్వీట్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో నటించిన జెనీలియా… స్టార్ హీరోయిన్ అయ్యింది మాత్రం తెలుగులోనే!
‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘హా…హా… హాసిని’ అంటూ జెన్నీ చేసిన అల్లరికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ‘వీలైతే నాలుగు మాటలు… కుదిరితే కప్పు కాఫీ’ అంటూ జెనీలియా డైలాగ్‌ను ఇప్పటికే తెగ వాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ‘ఢీ’, ‘రెఢీ’ వంటి హిట్టు సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత ఈ అమ్మడి యాటిట్యూడ్‌లో పూర్తిగా మార్పు వచ్చిందని, షూటింగ్‌లో ఓవర్ యాక్షన్ ఎక్కువైందని టాక్ వినిపించింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆరెంజ్’ సినిమా టైమ్‌లో జెన్నీ పెట్టిన ఇబ్బందుల గురించి నిర్మాత నాగబాబు ఓపెన్‌గానే చెప్పాడు.
ఆ ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌లో జెనీలియాకు ఛాన్స్‌లు దూరమయ్యాయి. రానాతో చేసిన ‘నా ఇష్టం’ జెనీలియా చివరి తెలుగు సినిమా. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలను, హీరోలను గుర్తుచేసుకుంటోంది. అయితే బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లిచేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లైన జెనీలియాకు ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్‌లు మాత్రం రావు. అక్క, వదిన పాత్రల్లో కనిపించడానికి జెనీలియా ఫిజిక్ సూట్ అవ్వదు. మరి ఏ పాత్రలు చేద్దామని జెనీలియా ఇలా చేస్తోంది? ఎందుకీ అర్థం లేని తాపత్రయం? అని అర్థం కాక తెగ కంఫ్యూజ్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్.
This post was last modified on May 16, 2020 3:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…