Movie News

చిరు వెర్సస్ ఎన్టీఆర్.. ఆక్సిజన్ వార్

కరోనా సెకండ్ వేవ్‌లో చాలామంది వైరస్ బాధితులకు ఆక్సిజన్ అత్యవసరమైంది. కానీ ఆసుపత్రుల్లో ఉన్న నిల్వలు బాధితులకు ఏమాత్రం సరిపోలేదు. చాలా చోట్ల సమయానికి ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోయాయి. ఎన్నో ఘోరాలు చూశాం. ప్రభుత్వాల వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో దారుణాలు జరిగాయి. ఐతే కొంచెం ఆలస్యంగా అయినా ప్రభుత్వాలు మేలుకొన్నాయి. అలాగే స్వచ్ఛందం సంస్థలు, సెలబ్రెటీలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లను సిద్ధం చేశారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేలా వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన్ని చూసి వేరే వాళ్లు కూడా కదులుతున్నారు.

ఐతే ఈ విషయంలో కూడా మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఫ్యాన్ వార్స్ తప్పట్లేదు సామాజిక మాధ్యమాల్లో. చిరు చేస్తున్న మంచి పనిని పొగడకుండా.. ఆయన ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నాడని, పెడుతున్న ఖర్చును ఎక్కువ చేసి చూపిస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ నెగెటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా తెలుగుదేశం అభిమానులు ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆక్సిజన్ ట్యాంకులే ఏర్పాాటు చేస్తున్నారని వాటి ముందు చిరు చేస్తున్నదెంత అని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఈ వ్యవహారంలో వైసీపీ వాళ్లు ఇందులో కలగజేసుకోవట్లేదు.

కాగా మెగా అభిమానులు, జనసైనికులేమో.. ఒక పెద్ద పొలిటికల్ పార్టీ అయి ఉండి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెలుగుదేశం తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదని, చిరు ఛారిటబుల్ ట్రస్టును చూసి ఎన్టీఆర్ ట్రస్ట్ కాపీ కొడుతోందని ఎద్దేవా చేస్తున్నారు. ఐతే ఎవరు మంచి పని చేసినా అందరూ అభినందించాలి. ప్రోత్సహించాలి. కానీ ఇలాంటి విషయాల్లో కూడా అవతలి వాళ్లకు ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందే అని డీగ్రేడ్ చేస్తూ, తాము గొప్ప అని డబ్బా కొట్టుకోవడం విచారకరం.

This post was last modified on May 27, 2021 7:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

37 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago