బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. కమల్ ఆర్.ఖాన్ అనే క్రిటిక్ మీద పరువు నష్టం దావా వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే జీ5, జీప్లస్ ఓటీటీ ద్వారా విడుదలైన తన కొత్త చిత్రం గురించి కమల్ ఇచ్చిన వీడియో రివ్యూ చూసి ఆగ్రహించి సల్మాన్ అతడికి నోటీసులు ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి.
ఐతే సినిమాకు సమీక్ష ఇవ్వడంలో తప్పేముంది, ఆ మాత్రానికే పరువు నష్టం దావానా అన్న సందేహాలు రావడం సహజం. ఆ మాటకొస్తే రాధె సినిమా మీద చాలామంది క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సినిమాను ఏకిపడేశారు. మరి కమల్ ఆర్.ఖాన్ మీద మాత్రమే సల్మాన్ టీం ఇలా దావా వేయడం ఏంటన్నది ప్రశ్న. దీనికి సమాధానం సల్మాన్ సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
కమల్.ఆర్.ఖాన్ బాలీవుడ్ స్టార్ల గురించి తన సమీక్షల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటాడు. మొదట్నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతోనే అతను సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. సినిమా సమీక్షల్లోనూ హీరోలను వ్యక్తిగతంగా దూషించడం అతడికి అలవాటు. రాధె రివ్యూలో కూడా సల్మాన్‌ను ఉద్దేశించి చోర్ అనడం అతడి టీం గుర్తించిందట. సినిమా గురించి రివ్యూ ఇస్తూ ఇలా వ్యక్తిగతంగా దూషించడం పట్ల సల్మాన్ టీంలో ఆగ్రహం వ్యక్తమైంది.
గతంలోనూ కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండటంతో ఈసారి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పరువు నష్టం దావా వేశారని.. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలాలనుకోవట్లేదని.. ఇంకోసారి సల్మాన్ గురించే కాక వేరే హీరోల గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడేలా అతడికి గుణపాఠం నేర్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
This post was last modified on May 27, 2021 8:37 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…