అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది ‘ఫ్యామిలీ మ్యాన్-2’. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన వెబ్ సిరీస్ ఇది అనడంలో సందేహం లేదు. రాజ్-డీకేల దర్శకత్వంలో అమేజాన్ ప్రైమ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ స్ట్రీమ్ అయిన కొన్ని నెలల నుంచి సెకండ్ సీజన్ గురించి ఊరిస్తూ వస్తున్నారు. కరోనా సహా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన రెండో సీజన్.. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ఐతే తమిళ టైగర్లను చెడుగా చూపించారని ఆరోపిస్తూ ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు తమిళుల నుంచి వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు కూడా వెళ్లాయి. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ అడ్డంకులను అధిగమించి అనుకున్న ప్రకారమే జూన్ 4న ప్రైమ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ స్ట్రీమ్ అవుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్ మీద ఉన్న అంచనాలను రాజ్-డీకే ఏ మేరకు అందుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ అనుకున్న మేర ఆడిన దాఖలాలు తక్కువ. మెజారిటీ సీక్వెల్స్ అంచనాలను అందుకోలేదు. వెబ్ సిరీస్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. ‘మీర్జాపూర్’ అందుకు ఉదాహరణ. అమేజాన్ ప్రైమ్‌లోనే రిలీజైన ఈ సిరీస్ తొలి సీజన్‌కు అద్భుత స్పందన వచ్చింది. ఇండియాలో వెబ్ సిరీస్‌లకు క్రేజ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమే.
ఐతే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మీర్జాపూర్-2’ మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. అర్జున్ రాంపాల్ నటించిన ‘ఆశ్రమ్’, అలాగే ‘ఔట్ ఆఫ్ లవ్’ సిరీస్‌ల రెండో సీజన్లు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. మరి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఈ నెగెటివ్ సెంటిమెంటును బ్రేక్ చేస్తుందేమో చూడాలి. దీని ట్రైలర్ చూస్తే మాత్రం తొలి సీజన్‌కు దీటుగానే ఉంటుందనిపిస్తోంది. మరి జూన్ 4న ఈ సిరీస్ అనుకున్నట్లుగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.
This post was last modified on May 26, 2021 9:28 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…