టాలీవుడ్ వరకు మిడ్ రేంజ్ స్టార్ అయిన ప్రభాస్.. ఆల్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడిగా మారడానికి కారణం బాహుబలి సినిమా. ఈ సినిమాకు కథ అందించింది విజయేంద్ర ప్రసాద్. ఆ కోణంలో చూస్తే ప్రభాస్ ఎదుగుదలకు విజయేంద్ర కూడా ఒక కారణమే. అయితే ఇప్పుడు ప్రభాస్, విజయేంద్ర మధ్య పరోక్షంగా బాక్సాఫీస్ వార్ జరగబోతుండటం విశేషం. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ అనే భారీ చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీని వాడుకుని రామాయణ గాథను భారీ స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఇప్పటికే ఇండియాలో రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు రాగా.. ఇది లేటెస్ట్ వెర్షన్.
ఐతే ప్రభాస్ రామాయణం మీద సినిమా చేస్తున్న సమయంలో.. ఈ పురాణ గాథకు మరో వెర్షన్ సిద్ధమవుతోంది. దీనికి కథ అందించింది విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం. ఆ సినిమా పేరు.. సీత. రామాయణ గాథను సీత కోణంలో చెప్పే కథ ఇది. విజయేంద్ర తనదైన శైలిలో ఈ కథను తీర్చిదిద్దారు. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సీత పాత్రను ఆలియా భట్ లేదా కరీనా కపూర్ ఎంపికవుతారని అంటున్నారు. ఆ పాత్రకు ఎవరు ఖరారవుతారో కానీ.. ఇందులో రావణుడి పాత్రకు మాత్రం రణ్వీర్ సింగ్ ఓకే అయ్యాడట. ఆదిపురుష్‌లో రావణుడి పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మన అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కలిసి రామాయణ నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టును కొన్నేళ్ల కిందటే ప్రకటించారు. కానీ అదింకా మొదలు కాలేదు. కానీ ఆ సినిమా మీద వర్క్ అయితే నడుస్తున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on May 26, 2021 1:33 am
కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…
కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…