రెండు రోజుల కిందటే 80వ పుట్టిన రోజును జరుపుకున్నాడు టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్. ఈ సందర్భంగా ఉత్సాహంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాను నటనకు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం తెలిసిందే. ఈ న్యూస్ వైరల్ అయింది కూడా. ఐతే మంగళవారం ఉదయం ఆయన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం మొదలైంది.
చంద్రమోహన్ అనారోగ్యం పాలయ్యారని.. ఆయన పరిస్థితి విషమించిందని కొందరు.. ఏకంగా చంద్రమోహన్ చనిపోయారని మరికొందరు ప్రచారాలు సాగించారు. ఈ న్యూస్ కాసేపట్లోనే వైరల్ అయింది. ఐతే దీని గురించి చంద్రమోహన్‌కు సమాచారం అందడంతో ఆయనే స్వయంగా ఒక సీనియర్ పీఆర్వోను సంప్రదించారు. తాను ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.
వీడియో కాల్ ద్వారా మాట్లాడి తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేశారు. అంతే కాక ఇంట్లో భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ సమాచారం మిగతా పీఆర్వోలకు కూడా పంచుకోవడంతో అందరూ చంద్రమోహన్ గురించి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ఇలా వయసు మీద పడ్డ సీనియర్ ఆర్టిస్టులను చంపేయడం ఇది కొత్త కాదు.
ఈ మధ్యే బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆయన దీనిపై వ్యంగ్యంగా స్పందించారు. రెండు రోజుల ముందు ఉత్సాహంగా మీడియాతో మాట్లాడిన చంద్రమోహన్ వార్తల్లో నిలవడంతో ఆయన గురించి ఇలాంటి ప్రచారం చేస్తే న్యూస్ వైరల్ అవుతుందనుకున్నారో ఏమో. ఇదిలా ఉంటే.. ఆరోగ్యం సహకరించకపోవడం, కరోనా ముప్పు కూడా ఉండటంతో ఇకపై తాను నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చంద్రమోహన్ వెల్లడించడం తెలిసిందే.
This post was last modified on May 25, 2021 3:40 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…