ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ అనుకున్న ప్రకారం జూన్ 4న రిలీజవుతుందో లేదో అన్న సందేహాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ సిరీస్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇంకా పెద్దదవుతోంది. ఈ సిరీస్‌లో సమంత పోషించిన పాత్రను ట్రైలర్లో గమనిస్తే.. అందులో ఎల్టీటీఈ నేపథ్యం కనిపిస్తోంది. తమిళ టైగర్ల తరహాలోనే ఆమె వస్త్రధారణ, లుక్ ఉంది. దీని పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన.
దీనిపై వైగో అనే ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాయడం తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టడం గమనార్హం.
వైగో తరహాలోనే కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని, సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను ప్రతికూల కోణంలో చూపించేలా కనిపిస్తోందని.. దీని పట్ల అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. అమేజాన్ ప్రైమ్ ఉద్దేశపూర్వకంగా తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ సిరీస్‌ను రూపొందించిందని ఇందులో పేర్కొన్నారు. జూన్ 4 నుంచి తమిళనాడులోనే కాక.. దేశవ్యాప్తంగా ఎక్కడా ఫ్యామిలీ మ్యాన్-2 ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరారు.
ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇలాంటి లేఖ వచ్చిందంటే ఫ్యామిలీ మ్యాన్-2కు అడ్డంకులు తప్పేలా లేవు. ఈ సిరీస్‌ను ఆపాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే జరిగితే ఫ్యామిలీ మ్యాన్-2 కోసం ఎప్పట్నుంచో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ తప్పదు.
This post was last modified on May 25, 2021 8:16 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…