తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం అన్నాత్తె షూటింగ్ కోసం నెల రోజులకు పైగా హైదరాబాద్‌లో గడిపిన సందర్భంగా రజినీ.. శంషాబాద్‌లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన రెండు రోజులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సందర్భంగానే మోహన్ బాబుతో.. ఆయన కుటుంబ సభ్యులతో రజినీ ఫొటోలు దిగినట్లున్నారు. దీని కోసం మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ బాగానే తయారైనట్లున్నారు. ఫొటో షూట్ అదీ రిచ్‌గానే చేసినట్లున్నారు. ఇందులో రజినీని మించిన ఆకర్షణతో కనిపిస్తున్నారు మోహన్ బాబు. ఆయన లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక రజినీ అట్రాక్షన్ గురించి చెప్పేదేముంది? బయట బట్టతలతో చాలా సాధారణంగా కనిపించినా ఆయనలో ఆకర్షణకు లోటుండదు.
రజినీ, మోహన్ బాబు కలిసి ఉన్న ఫొటోలు చూసిన వాళ్లకు వీళ్లిద్దరి కలయికలో ఇప్పుడో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే ఆశ్చర్యం లేదు. మోహన్ బాబు సొంత సంస్థలో నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ పెదరాయుడులో రజినీ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. క్యామియో రోల్ అయినా సరే… అది అద్భుతంగా పండింది. తర్వాత మోహన్ బాబు చేసిన రాయలసీమ రామన్న చౌదరి చిత్రానికి రజినీ స్వయంగా కథ అందించడం విశేషం. తర్వాత ఇద్దరూ కలిసి ఏ సినిమాకూ పని చేయలేదు. వ్యక్తిగతంగా ఇద్దరూ కలిసి కనిపించింది తక్కువ.
ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కలిసి సమయాన్ని గడిపిన సందర్భంగా మంచి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎవరికి స్థాయిలో వాళ్లకు తిరుగులేని ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను అద్భుతంగా పండించే మోహన్ బాబు.. రజినీ చిత్రంలో విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎగ్జైట్ చేసేదే. మరి ఈ ఫొటోలు చూసి ఏ దర్శకుడికైనా ఈ ఆలోచన కలిగి కథ రాసి, ఈ ఇద్దరినీ ఒప్పించి సినిమా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on May 21, 2021 10:04 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…