Movie News

ఎన్టీఆర్.. అన్నను వదలట్లేదే


జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల తండ్రి ఒకరే కానీ.. తల్లులు వేరన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ వేర్వేరుగానే పెరిగారు. ఒక దశ వరకు ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏమీ లేదు. ‘ఓం’ సినిమా టైంలో ఒక ఇంటర్వ్యూలో తారక్‌తో అనుబంధం గురించి కళ్యాణ్ రామ్‌ను అడిగితే.. తాము చాలా క్లోజ్ అని, రోజూ కలుస్తుంటామని చెప్పలేనని.. అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ మాత్రం ఉంటామని వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ హీరోగా అరంగేట్రం చేసినపుడు, స్టార్‌గా ఎదుగుతున్నపుడు కళ్యాణ్‌ రామ్‌తో అంత క్లోజ్‌గా ఏమీ లేడన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఐతే హరికృష్ణ మరో కొడుకు, కళ్యాణ్ రామ్ అన్నయ్య జానకి రామ్ చనిపోయినపుడు.. ఆ విషాద సమయంలో తారక్, కళ్యాణ్ రామ్ దగ్గరయ్యారు. హరికృష్ణ మరణానంతరం ఒకరికి ఒకరు అన్నట్లుగా ఇద్దరూ ఇంకా చేరువయ్యారు. ఇక అప్పట్నుంచి ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లాగే వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలను తారక్ ప్రమోట్ చేయడం.. తారక్ సినిమాల వేడుకలకు కళ్యాణ్ రామ్ రావడం.. ఇతర సమయాల్లోనూ ఇద్దరూ ఒకటిగా కలిసి అడుగులు వేస్తుండటం గమనించవచ్చు.


కళ్యాణ్ రామ్ సినిమాల నిర్మాణంతో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని అందరికీ తెలుసు. అతనొక్కడే, పటాస్ మినహా అన్నీ అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అతడి నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కష్టాల్లో ఉండగా తారక్ ఆ బేనర్లో ‘జై లవకుశ’ చేసి దానికి మంచి లాభాలు అందించాడు. అంతటితో ఆగిపోకుండా ఇప్పుడు వరుసగా తన చిత్రాల్లో ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ను తారక్ భాగస్వామ్యం చేస్తుండటం విశేషం.

ఇటీవలే ప్రకటించిన కొరటాల శివ చిత్రానికి మిక్కిలినేని సుధాకర్ నిర్మాత కాగా.. దీనిలో కళ్యాణ్ రామ్‌కు కూడా షేర్ ఇప్పించాడు. నిజానికి దీనికి ముందు త్రివిక్రమ్‌తో అనుకున్న చిత్రానికి కూడా కళ్యాణ్ రామ్ భాగస్వామే. కానీ అది క్యాన్సిల్ కావడంతో శివ చిత్రంలోకి అన్నయ్యను తీసుకొచ్చాడు. దాని బదులు ఇది అనుకున్నారు కానీ.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాలోనూ కళ్యాణ్ రామ్‌ను భాగస్వామిని చేశాడు తారక్.

త్రివిక్రమ్‌తో ఇప్పుడు సినిమా క్యాన్సిల్ అయినా.. తర్వాత ఉండొచ్చు అంటున్నారు. అది మొదలైనపుడు మళ్లీ కళ్యాణ్ రామ్ వచ్చినా ఆశ్చర్యం లేదేమో. బహుశా చాలా మంది హీరోలు సొంత బేనర్లు పెట్టి తమ సినిమాల్లో పార్టనర్‌షిప్‌ తీసుకుంటున్నట్లు తారక్ అన్నయ్య బేనర్‌ను వివిధ ప్రాజెక్టుల్లోకి తీసుకొస్తున్నట్లుంది.

This post was last modified on May 20, 2021 9:15 pm

Share
Show comments

Recent Posts

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

58 minutes ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

1 hour ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

2 hours ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

2 hours ago

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

2 hours ago

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

3 hours ago