ఫ్యామిలీ మ్యాన్.. ఫ్యామిలీ మ్యాన్.. ఈ ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అమేజాన్ ప్రైమ్‌లో రెండేళ్ల ముందు విడుదలై అద్భుత ఆదరణ సంపాదించుకున్న ఈ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పడు సెకండ్ సీజన్ విడుదలకు సిద్ధమైంది. దీని ట్రైలర్‌ను బుధవారం ఉదయం రిలీజ్ చేశారు. ఇలా ట్రైలర్ లాంచ్ కావడం.. అలా వైరల్ అయిపోయింది. దీనికి భారీగా వ్యూస్ వస్తున్నాయి. అందరూ ట్రైలర్ అదుర్స్ అనే అంటున్నారు.
సెకండ్ సీజన్ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా కావాల్సినంత ఉత్కంఠ, ఫన్ ఉండటంతో ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ సిరీస్‌లో ఉత్కంఠకు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ పండటం.. కామెడీ కూడా హైలైట్ అరుదుగా జరుగుతుంటుంది. ‘ఫ్యామిలీ మ్యాన్’కు మంచి రీచ్ రావడానికి ఇదొక ముఖ్య కారణం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఇది ఆకట్టుకుంది. గత రెండేళ్ల వ్యవధిలో కోట్ల మంది ఈ సిరీస్ చూశారు.
సెకండ్ సీజన్ కోసం ఆ కోట్ల మంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు. తొలి సీజన్ చివర్లో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మధ్య సిరీస్‌ను ముగించడంతో సెకండ్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ట్రైలర్లో సమంత పాత్రకు తోడు కొత్త ఎపిసోడ్స్ ఉత్కంఠ రేకెత్తించేలాగే కనిపిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కావడం ఆలస్యం.. ఇండియాలో టాప్‌లో ట్రెండ్ అయింది ‘ఫ్యామిలీ మ్యాన్’ హ్యాష్ ట్యాగ్. సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఈ సిరీస్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ట్రైలర్ గురించి వాళ్లు ఎగ్జైట్మెంట్‌తో పెట్టిన కామెంట్లను బట్టి తెలుస్తోంది.
ఇక మామూలు ప్రేక్షకుల గురించైతే చెప్పాల్సిన పని లేదు. అందరూ ట్రైలర్ అదుర్స్ అంటూ సిరీస్ కోసం ఎదురు చూడలేకపోతున్నాం అంటున్నారు. చూస్తుంటే.. ఇండియన్ ఓటీటీ రికార్డులన్నీ బద్దలు కొట్టే స్థాయిలో ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ ఆదరణ పొందడం, వ్యూస్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న ఫ్యామిలీ మ్యాన్-2 ప్రిమియర్స్ పడనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 19, 2021 3:49 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…