వర్తమానంలో కావచ్చు.. గతంలో కావచ్చు.. మొత్తంగా ప్రపంచ సినీ చరిత్రనే తీసుకున్నా సరే.. ఏవి అత్యంత గొప్ప సినిమాలో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా చూసేది ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) వైపే. ప్రేక్షకుల సమీక్షలు, ఓటింగ్ ఆధారంగా ప్రతి సినిమాకూ రేటింగ్ ఇస్తుంటుంది ఐఎండీబీ. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రపంచ సినిమాలో ఏవి ఉత్తమమైనవో ఐఎండీబీ చూసే తెలుసుకుంటారు. గూగుల్లో బెస్ట్ మూవీస్ అంటూ వెతికినా ఐఎండీబీ జాబితాలే కనిపిస్తాయి. ఈ వెబ్ సైట్లో తమ సినిమాలకు మంచి రేటింగ్ వస్తే దాన్ని గొప్పగా చూపించుకుంటారు ఫిలిం మేకర్స్.
ఇంత ప్రాధాన్యం ఉన్న ఐఎండీబీలో ఆల్ టైం వరల్డ్ మూవీస్‌లో ఓ తమిళ-తెలుగు చిత్రానికి మూడో స్థానం దక్కడం విశేషం. ఆ సినిమానే సూరారై పొట్రు/ఆకాశం నీ హద్దురా. గత ఏడాది అక్టోబరు 12న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే.
థియేటర్లు మూతపడి జనాలకు ఓటీటీల్లోనూ సరైన సినిమా వినోదం దక్కని సమయంలో ‘సూరారై పొట్రు’ విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి చాలా మంచి సమీక్షలు వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా అదిరిపోయింది. అమేజాన్ ప్రైమ్‌లో అత్యంత ఆదరణ సంపాదించుకున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ‘సూరారై పొట్రు’ ఆస్కార్ అవార్డులకు కూడా పోటీ పడటం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది.
ఐఎండీబీ ఆల్ టైం హైయెస్ట్ రేటింగ్ చిత్రాల్లో మూడో స్థానం సాధించడం విశేషం. ఈ జాబితాలో ఎప్పట్నుంచో ‘ష్వాషాంగ్ రిడెంప్షన్’ అగ్రస్థానంలో ఉంది. 1994లో విడుదలైన ఈ చిత్రం 9.3 రేటింగ్‌తో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. 1972లో రిలీజైన ‘గాడ్ ఫాదర్’ 9.2 రేటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ‘సూరారై పొట్రు’ 9.2 రేటింగ్‌తో మూడో స్థానానికి చేరుకుంది. ఐతే దీర్ఘకాలంలో ఈ రేటింగ్ నిలబెట్టుకోవడం మాత్రం అంత తేలిక కాదు.
This post was last modified on May 14, 2021 11:16 am
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…