లాక్ డౌన్ టైంలో సెలబ్రెటీలు తమ అభిమానుల్ని అలరించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. టిక్ టాక్‌ను ఫుల్లుగా వాడుకుంటూ ఫాలోవర్లకు వినోదం పంచుతున్నారు. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత యోగా టీచర్ కమ్ బిజినెస్ ఉమన్ శిల్పా శెట్టి తరచుగా టిక్ టాక్ వీడియోలు చేస్తుంటుంది. ఆమె ఆ మధ్య ‘బుట్ట బొమ్మ’ పాటకు సైతం డ్యాన్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే.
తాజాగా శిల్పా ఓ ఫన్నీ వీడియో చేసింది. అందులో భర్త రాజ్ కుంద్రాను ఉతికి ఆరేసింది. ఇందుకోసం ఆమె ఫన్నీ కాన్సెప్ట్ తీసుకుంది. పక్కన భర్త ఉండగా తాను ఇంటి పనికి సిద్ధమైంది శిల్పా. బట్టలు సర్దుతూ.. తాను పనిలో ఉన్నానని, మధ్యలో ముద్దులు పెట్టడం లాంటివి చేయొద్దని భర్తను హెచ్చరించింది శిల్పా.
ఐతే అంతలోనే పని మనిషి అందుకుంది. నేను కూడా పని చేసేటపుడు ముద్దులు పెట్టడం లాంటివి చేయొద్దని చెప్పినా వినడేంటి మీ ఆయన అంటూ కౌంటర్ వేసింది. వెంటనే శిల్పా ఆగ్రహంతో ఊగిపోతూ భర్తను ఉతికారేసింది. ఐతే ఇక్కడ పని మనిషి పాత్రలో కనిపించింది కూడా శిల్పానే. ఏవో ఎఫెక్టులు జోడించి మరో వ్యక్తిలా చూపించారు. ఐతే కాన్సెప్ట్ ఫన్నీగా ఉండటంతో శిల్పా ఫాలోవర్లు బాగానే ఎంటర్టైన్ అవుతున్నారు.
బాలీవుడ్లో శిల్పా ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోయినే కానీ.. కెరీర్ చరమాంకంలో ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది. ‘బిగ్ బాస్’ తరహాలో సాగిన బ్రిటిష్ షో ‘బిగ్ బ్రదర్’లో ఓ బ్రిటిష్ నటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో శిల్పాకు సింపతీతో పాటు పాపులారిటీ కూడా వచ్చింది. ఆ తర్వాత ఆమె వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడటం, ఇద్దరూ కలిసి ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌లో భాగస్వాములు కావడం.. 2013 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ ఫ్రాంఛైజీ నుంచి బయటికి రావడం తెలిసిందే.
This post was last modified on May 14, 2020 6:42 pm
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…