పుష్ప చిత్రం ఫస్ట్ లుక్ అదిరిపోయింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ తీయడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సుకుమార్ ఎంచుకున్న నేపథ్యం, బన్నీ గెటప్ పూర్తిగా మన నేటివిటీకి తగ్గట్లుంది.
సుకుమార్ కి హిందీ చిత్ర పరిశ్రమతో సంబంధం లేదు. రష్మిక కూడా అక్కడి వారికి పరిచయం లేదు. విజయ్ సేతుపతి ఉన్నాడు కాబట్టి తమిళంలో విడుదల చేయడం మంచి ఆలోచనే. అలాగే రష్మిక వల్ల కర్ణాటకలో అదనపు బలం ఉండొచ్చు. అల్లు అర్జున్ కి కేరళలో ఫాలోయింగ్ ఉంది. కనుక ఇది పాన్ సౌత్ ఇండియన్ సినిమా కావడానికి ఎలాంటి సమస్యా లేదు.
కానీ హిందీలోను విడుదల చేసే ఆలోచన ఉందంటే అది కేవలం బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకి యూట్యూబ్ లో వస్తున్నహిట్స్ వల్లనే. యూట్యూబ్ హిట్స్ బాక్సాఫీస్ కలెక్షన్లుగా మారతాయా లేదా అనేది పుష్ప హిందీలో విడుదలయితే కానీ తెలీదు.
This post was last modified on April 9, 2020 6:34 pm
తెలుగు సినిమాల్లో ఒకప్పుడున్న కామెడీ వైభవం.. ఇండియాలోని ఇతర భాషల్లోనే కాదు, ప్రపంచంలోనే మరే సినీ పరిశ్రమలోనూ లేదు అంటే అతిశయోక్తి…
టాలీవుడ్లో అడివి శేష్.. రాహుల్ రవీంద్రన్.. వెన్నెల కిషోర్.. సుజీత్.. ఈ నలుగురూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీలో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ హవా భారీగా తగ్గిపోయిందా? ఆయన…
బీఆర్ ఎస్ అగ్రనాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆయన…
ఒక సినిమాలో భాగమైన ప్రతి వ్యక్తీ.. తమ చిత్రం అద్భుతం అనే చెబుతాడు. ఇలాంటి సినిమా ఇంత వరకు రాలేదంటాడు.…
నవంబర్ ఏదో డ్రై నెల అంటారు కానీ ఈసారి మటుకు ప్రతివారం బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొంటోంది. ఎన్ని…