షారుఖ్ ఖాన్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రాల్లో ‘దేవదాస్’ ఒకటి. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘దేవదాస్’ కథనే తీసుకుని ఆధునిక హంగులతో కళ్లు జిగేల్‌మనేలా తీర్చిదిద్దాడు లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ. తాను ఏ సినిమా తీసినా తనదైన టేకింగ్ ద్వారా దానికి క్లాసిక్ టచ్ ఇచ్చే బన్సాలీ.. ‘దేవదాస్’ను ప్రత్యేకమైన సినిమాగా నిలబెట్టాడు. దీని తర్వాత బన్సాలీ తీసిన సినిమాలన్నీ క్లాసిక్స్ జాబితాలో చేరాయి. చివరగా ఆయన్నుంచి ‘పద్మావత్’ లాంటి కల్ట్ మూవీ వచ్చింది.
ప్రస్తుతం ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడీ’ అనే సినిమా తీస్తున్నాడు బన్సాలీ. ఇటీవలే విడుదలైన దాని టీజర్ ఆకట్టుకుంది. బన్సాలీ మరో హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా అనుకుని కొన్ని కారణాల వల్ల దాన్ని పక్కన పెట్టేసిన బన్సాలీ.. తన తర్వాతి చిత్రం కోసం షారుఖ్ ఖాన్‌తో జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘దేవదాస్’ తర్వాత షారుఖ్, బన్సాలీ కలిసి సినిమా చేయనున్నారని.. ఇజ్‌హార్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారని.. ఇదొక ప్రేమకథ అని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. టైటిల్ కూడా చెప్పేశారంటే కచ్చితంగా ‘దేవదాస్’ కాంబినేషన్‌ను చూడబోతున్నట్లే. ప్రేమకథలు తీయడంలో బన్సాలీది ప్రత్యేకమైన శైలి. ఆ జానర్‌లో షారుఖ్ కూడా అద్భుతమైన సినిమాలు చేశాడు. కాబట్టి వీరి కలయికలో ఒక క్లాసిక్‌ను ఆశించవచ్చు.
‘జీరో’ సినిమాతో మార్కెట్ జీరో అయిపోవడంతో రెండేళ్లకు పైగా విరామం తీసుకున్న షారుఖ్.. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ గత సినిమాల ప్రభావం ఏమీ లేకుండా ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. దీని తర్వాత అతను గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానితో ఓ సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. దానికి ముందో, తర్వాతో బన్సాలీతో షారుఖ్ సినిమా చేస్తాడంటున్నారు.
This post was last modified on May 11, 2021 10:36 am
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…