సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం కారణంగా ఇండియన్-2 సినిమా మధ్యలో ఆగిపోవడం.. ఆ తర్వాత ఎంతకీ అది పున:ప్రారంభం కాకపోవడం.. ఈ విషయమై దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిన సంగతే. త్వరగా ఈ సినిమాను పున:ప్రారంభించే విషయం తేల్చాలని కొన్ని నెలల ముందు నిర్మాతలను నిలదీస్తే వాళ్లు స్పందించలేదు. తర్వాత శంకరేమో రామ్ చరణ్‌తో వేరే సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంటే నిర్మాతలు అడ్డం పడ్డారు.
వీళ్లిలా గొడవ పడుతుంటే హీరో కమల్ హాసన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నాడు. నిజానికి ‘ఇండియన్-2’ పున:ప్రారంభం కాకపోవడానికి అసలు కారణం కమలే అన్నది కోలీవుడ్ వర్గాల మాట. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో ఆయనకు పెద్ద గొడవే జరిగింది. ఆయన పొలిటికల్ కమిట్మెంట్లు కూడా సినిమా మళ్లీ మొదలు కాకపోవడానికి కారణం. ఇండియన్-2 సంగతి తేల్చకుండా ‘బిగ్ బాస్’ షో చేయడం, అలాగే ‘విక్రమ్’ అనే మరో సినిమాను ఆయన మొదలుపెట్టడం తెలిసిందే.
ఐతే ఇటీవల వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్ హాసన్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. స్వయంగా కమలే ఓడిపోయాడు. ఇప్పుడు తన రాజకీయ గమ్యం ఏంటో తెలియని అయోమయంలో ఉన్నారు కమల్. ప్రస్తుతానికి రాజకీయాల్లో ఆయన చేయడానికి ఏమీ లేదు. దీంతో మళ్లీ అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో బిజీ అవ్వాలని కమల్ చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ‘ఇండియన్-2’ వివాదాన్ని పరిష్కరించి ఈ సినిమాను పున:ప్రారంభించడానికి కమలే చొరవ తీసుకోనున్నాడట. ఏకంగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఆపేయడం సరి కాదని భావించి.. లైకా అధినేతలు, శంకర్‌తో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించి పూర్తి చేయాలని కమల్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘ఇండియన్-2’తో పాటు ‘విక్రమ్’ షూటింగ్‌లో కమల్ సమాంతరంగా పాల్గొనే అవకాశాలున్నాయంటున్నారు.
This post was last modified on May 9, 2021 9:23 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…