హీరోయిన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ ప్రేమ-పెళ్లి గురించి చర్చ ఇప్పటిది కాదు. ఆమె కథానాయికగా చాలా బిజీగా ఉన్న టైంలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో ప్రేమలో ఉందని.. అతణ్ని పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే కొన్నేళ్ల తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. ఆ తర్వాత కథానాయికగా ఛార్మి ప్రభ తగ్గడం మొదలయ్యాక ఛార్మి పెళ్లి గురించి కొన్ని సార్లు చర్చ వచ్చింది. కానీ ఆమె పూరి జగన్నాథ్ క్యాంపులో చేరిపోయి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. కొన్నేళ్లుగా ఆయనతో కలిసి సాగుతోంది. సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం కూడా ఆమె ‘లైగర్’ సినిమా పనిలో బిజీగా ఉంది.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఛార్మి పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె పెళ్లి వైపు అడుగులు వేయబోతున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై ఛార్మి తనదైన శైలిలో స్పందించింది.
తన పెళ్లి వార్తలపై ఛార్మి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అందులో.. ‘‘నేనిప్పుడు నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నా. నా జీవితం పట్ల చాలా సంతోషంగానూ ఉన్నాను. కాబట్టి పెళ్లి అనే తప్పును నా జీవితంలో ఎప్పటికీ చేయను’’ అనేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఓకే కానీ.. ఎప్పటికీ పెళ్లి చేసుకునేదే లేదు అని ఛార్మి ఖరాఖండిగా చెప్పేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది పూరి జగన్నాథ్ ప్రభావంతో తీసుకున్న నిర్ణయమా అన్న చర్చ నడుస్తోంది జనాల్లో.
పూరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు కానీ.. పెళ్లి విషయంలో ఆయనంత సానుకూల వ్యాఖ్యలు చేయడు. పాడ్ కాస్ట్‌ల్లో కూడా పెళ్లి గురించి కొంత ప్రతికూల వ్యాఖ్యలే చేశాడు. ఇక పూరి గురువు రామ్ గోపాల్ వర్మ సంగతి తెలిసిందే. పెళ్లి గురించి పూర్తి నెగెటివ్‌గా మాట్లాడతాడు. ఛార్మి మీద వీరి ప్రభావం బాగానే పడిందని.. అందుకే పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 9, 2021 9:11 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…