సంగీత దర్శకుడు కావడానికి ముందు గాయకుడిగా రఘు కుంచెకు మంచి పేరు తెచ్చిన పాట.. ‘బాచి’లోని లచ్చిమి లచ్చిమి లచ్చిమి. సంగీత దర్శకుడిగా చక్రికి బ్రేక్ ఇచ్చింది కూడా ఈ పాటే. ఐతే నిజానికి ఈ పాటను రఘు పాడాల్సిందే కాదట. ఒరిజినల్‌గా దాన్ని చక్రినే పాడదామనుకున్నాడట. మరి ఆ పాట తన ఖాతాలోకి ఎలా వచ్చిందో.. ఆ పాట ద్వారా ఎలా తన కెరీర్ మలుపు తిరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రఘు కుంచె.
సినిమాల మీద పిచ్చితో తాను హైదరాబాద్‌కు వచ్చినపుడు పూరి జగన్నాథ్ ఒక కేఫ్‌లో పరిచయం అయ్యాడని.. తర్వాత తామిద్దరం రూం మేట్స్ అయ్యామని.. అప్పటికి పూరి దర్శకుడిగా అవకాశం కోసం చూస్తున్నాడని రఘు తెలిపాడు. రూంలో తాను పాడే పాటలు విని తాను దర్శకుడైతే గాయకుడిగా ఛాన్స్ ఇప్పిస్తానని పూరి మాట ఇచ్చాడని.. కానీ తొలి సినిమా ‘బద్రి’ పెద్ద బేనర్లో, పెద్ద హీరోతో కావడంతో తనకు పాట ఇప్పించలేకపోయాడని రఘు వెల్లడించాడు.
‘బద్రి’కి తొలి రోజు డివైడ్ టాక్ రావడంతో సినిమా పోయిందని పూరి నిరాశలో మునిగిపోయాడని.. కానీ తర్వాత పుంజుకున్న సినిమా పెద్ద హిట్టయిందని.. ఆపై పూరి కొంచెం డిఫరెంట్ స్టయిల్లో ‘బాచి’ సినిమా చేయడానికి రెడీ అయ్యాడన్నాడు.
ఈ సినిమాకు కొత్త సంగీత దర్శకుడిని ట్రై చేద్దామనుకుని చక్రిని పిలిపించాడని.. అతను టేబుల్ మీద చేత్తో వాయిస్తూ కొన్ని పాటలు పాడాడని.. అవి విని ఇంప్రెస్ అయి వెంటనే సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడని.. అప్పుడే తనతో ఈ సినిమాలో ఓ పాట పాడించాలని చక్రికి చెప్పడంతో అతను ఓకే అన్నాడని తెలిపాడు. ఐతే చక్రి కంపోజ్ చేసుకున్న ఐదు పాటల్లో తనకు ‘లచ్చిమి లచ్చిమి’ నచ్చి ఆ పాటే పాడతానని పూరితో చెప్పానని.. నిజానికి ఆ పాటను చక్రి ఎంతో ఇష్టపడి, తాను పాడాలనుకున్నాడని.. కానీ పూరి చెప్పడంతో తనతో పాడించాడని రఘు తెలిపాడు. ముందు తాను బాలసుబ్రహ్మణ్యం స్టయిల్లో ట్రెడిషనల్‌గా ఈ పాట పాడానని.. కానీ చక్రి ఒక డిఫరెంట్ స్టైల్ కోరుకున్నాడని.. తర్వాత ఆడియోలో ఉన్నట్లుగా వెరైటీగా ఈ పాట పాడానని.. ఈ పాట సూపర్ హిట్టయి తన కెరీర్‌ను మార్చేసిందని రఘు వెల్లడించాడు.
This post was last modified on May 8, 2021 8:46 am
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…