సినిమాల్లో స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్లు ఒక్కొక్కరుగా డిజిటిల్ మీడియం వైపు అడుగులు వేస్తున్నారు. తమన్నా సైతం ఎన్నో ఆశలతో అటు వైపు అడుగులేసింది. ఆమె అరంగేట్ర వెబ్ సిరీస్ ‘లెవెంత్ అవర్’ గత నెలలోనే ఆహాలో ప్రసారం అయింది. కానీ ఈ సిరీస్‌కు ఆశించిన స్పందన రాలేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీగానే ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు కానీ.. కథ బాగున్నా సరే, ట్రీట్మెంట్ అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ‘లెవెంత్ అవర్’ ఆదరణ పొందలేదు.
అయినా సరే.. తమన్నా వెనకడుగు వేయలేదు. ఈసారి హాట్ స్టార్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ‘నవంబర్ స్టోరీ’ పేరుతో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
వెబ్ సిరీస్‌ల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు మంచి సక్సెస్ రేట్ ఉంది. తమన్నా ఈసారి ఆ జానరే ట్రై చేస్తోంది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఒక ఇంట్లో ఓ హత్య జరగడం.. ఏకంగా దానిపై 47 పోట్లు ఉండటం.. ఆ పోట్లు కత్తితో కాకుండా పెన్నుతో పొడిచినట్లు తేలడం.. ఏ ఆధారాలు దొరక్కుండా హంతుకుడు హతుడి ఒంటి మీద పెయింట్ పోయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకోవడం.. తమన్నా తండ్రే ఈ హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తడం.. ఈ నేపథ్యంలో ట్రైలర్ చాలా ఉత్కంఠభరితంగానే అనిపిస్తోంది. బోలెడన్ని మలుపులతో ఈ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇచ్చేలాగే ఉంది. ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. చూస్తుంటే మిల్కీ బ్యూటీ ఈసారి సక్సెస్ అందుకునేలాగే కనిపిస్తోంది.
This post was last modified on May 6, 2021 4:06 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…