#PSPK28.. ఈ హ్యాష్ ట్యాగ్ బుధవారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ముందు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయిన ఈ హ్యాష్ ట్యాగ్.. తర్వాత ఇండియా లెవెల్లో ట్రెండ్ అవడం మొదలైంది. వేలల్లో ట్వీట్లు పడ్డాయి దీని మీద. దీనికి కారణం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. అతను ఓ జాతీయ వెబ్ సైట్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాడు దేవి. ఈ సినిమా సూపర్ డూపర్ స్క్రిప్టుతో తెరక్కబోతోందని దేవి అన్నాడు. అభిమానులను ఎంతగానో ఎగ్జైట్ చేసే స్క్రిప్టు ఇదని.. వారి అంచనాలకు తగ్గట్లుగానే చాలా ఎనర్జిటిగ్గా సినిమా ఉంటుందని, వాళ్లకు బాగా నచ్చే సినిమా ఇదని అన్నాడు.
ఈ సినిమా కోసం సంగీత చర్చలు ఎంత వరకు వచ్చాయని అడిగితే ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశానని.. మిగతా పాటల పని నడుస్తోందని దేవి అన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు కూడా దేవి వ్యాఖ్యానించాడు. దేవి ఇలా మాట్లాడిన వీడియో కాసేపటికే ట్విట్టర్లో వైరల్ అయిపోయింది. అతడి వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టి పవన్ అభిమానులు సంబరాలు చేయడం మొదలుపెట్టారు.
‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కలయికలో రాబోయే సినిమా కావడంతో దీనిపై ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. దీని గురించి ఎప్పుడు చర్చ వచ్చినా పవన్ అభిమానులు చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు. ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ను మించి ఎన్నో రెట్లు బాగుంటుందని, కొంచెం సందేశం మిళితమైన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఇంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఇంతకముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలసిందే. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది
This post was last modified on May 6, 2021 8:32 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…