ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొన్నేళ్లకు సరిపడా కమిట్మెంట్లతో డైరీలను నింపేశారు. కానీ అల్లు అర్జున్ చేతిలో మాత్రం ఒక్కటే సినిమా ఉంది. అదే.. పుష్ప. ఇది కొన్ని నెలల్లో పూర్తయిపోతుంది. తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంలో స్పష్టత లేదు. ‘పుష్ప’ బన్నీకి 20వ చిత్రం కాగా.. 21వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కమిటయ్యాడు. కానీ అనుకోకుండా కొరటాల.. తన తర్వాతి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్‌కు కమిటవ్వడంతో బన్నీ సినిమా వెనక్కి వెళ్లింది. ప్రస్తుతానికి అది వాయిదా మాత్రమే పడిందనుకుంటున్నారు.
మరి ‘పుష్ప’ పూర్తయ్యాక బన్నీ ఏ సినిమా చేస్తాడన్నది ఇప్పుడు సస్పెన్సుగా మారింది. ప్రశాంత్ నీల్‌తో చర్చలు జరిగాయి కానీ.. ఆ కాంబినేషన్ ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు. వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ స్క్రిప్టుతో రెడీగా ఉన్నాడు కానీ.. బన్నీ ఆ సినిమా చేయడం సందేహమే అంటున్నారు.
మరి బన్నీ మనసులో ఏముందో.. అతను ‘పుష్ప’ తర్వాత ఎవరితో జట్టు కడతాడో తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ అవకాశం మురుగదాస్ దక్కించుకున్నాడట. మురుగదాస్ మంచి ఫాంలో ఉన్నపుడు ఆయనతో సినిమా చేయడానికి బన్నీ గట్టిగానే ప్రయత్నించాడు. మురుగదాస్ సైతం బన్నీతో చేయడానికి ముందు నుంచే ఆసక్తితో ఉన్నాడు. కానీ కుదర్లేదు. ఐతే ఎట్టకేలకు వీరి కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
‘దర్బార్’ తర్వాత విజయ్‌తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేశాక ఏవో కారణాలతో ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు మురుగ. ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న మురుగకు కోలీవుడ్లో మరే స్టార్ హీరో కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో అతను బన్నీ వైపు చూశాడని.. అతను కూడా ఆసక్తిని ప్రదర్శించడంతో వీరి కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో చూడాలి మరి.
This post was last modified on May 3, 2021 2:49 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……