‘వకీల్‌సాబ్’ తో పవన్ అభిమానులంతా ఆనందంగా ఉన్నారు. తమ అభిమాన హీరోని పవర్ ప్యాకెడ్ రోల్ లో చూపినందుకు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓటీటిలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తోంది. ఇదంతా ఖచ్చితంగా దర్శకుడు వేణు శ్రీరామ్ ని ఆనందపరిచే అంశమే. గతంలో రెండు సినిమాలు చేసినా ఈ సినిమాతో దర్శకుడిగా ఓ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ వేణుశ్రీరామ్. ‘వకీల్‌సాబ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపధ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో చెప్పుకునేదాని ప్రకారం..వేణు శ్రీరామ్ మేకింగ్ స్టెయిల్ నచ్చిన పవన్ కళ్యాణ్ తనకు మరో స్క్రిప్టు రెడీ చేయమని అడిగారట. అందులో వింతేమీ లేదు కూడా.
పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన,కంఫర్ట్ గా ఉన్న డైరక్టర్స్ తో కంటిన్యూగా సినిమాలు చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఎప్పుడు కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది. పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అప్పటిదాకా వేణు శ్రీరామ్ వెయిట్ చేయాలా. మరో హీరోతో సినిమా చేసి వస్తాడా..లేక ఈ లోగా పవన్ ని తన స్క్రిప్టుతో ఒప్పించే పనిలో ఉంటాడా. పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలంటే ఖచ్చితంగా చాలా కాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే కరోనా క్రైసిస్ తగ్గేదాకా సినిమాలు ప్రారంభం కావు.
అప్పుడు ఒక్కొక్క సినిమా పవన్ పూర్తి చేసుకుంటారు. అవన్నీ అయ్యాక వరసలో వేణు శ్రీరామ్ దగ్గరకు వస్తాడు. అయితే పవన్ వంటి స్టార్ హీరోతో చేయాలనుకున్నప్పుడే వెయిట్ చేయకతప్పదు. అది హరీష్ శంకర్ ని అడిగినా చెప్తాడు. అదంతా సరే ఈలోగా అల్లు అర్జున్ తో ఐకాన్ చేసేస్తాడా అని కొందరి ప్రశ్న. అయితే అసలు ఐకాన్ ప్రాజెక్టు ..ని అల్లు అర్జున్ చేస్తాడా అన్నది మరో ప్రశ్న. ఇవన్ని చూస్తూంటే వేణుశ్రీరామ్ మినిమం రెండు నుంచి మూడేళ్లు వెయిట్ చేస్తే కానీ పవన్ తో సినిమా కష్టం. వెయిట్ చేస్తాడా లేదా అన్నది అతని ఇష్టం.
This post was last modified on May 1, 2021 4:25 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…