పిక్ టాక్ : కల్పిక గణేష్ హాట్ ట్రీట్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్పిక గణేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, ప్రయాణం లాంటి చిత్రాల్లో నటించింది. కల్పిక నటించిన మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఈ గ్లామర్ బ్యూటీ ప్రయత్నిస్తోంది. తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచే రోల్ ఇంకా పడలేదు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కల్పిక గణేష్ తన గ్లామర్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇటీవల కల్పిక ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా కల్పిక మోనోకిని తరహాలో ఉండే డ్రెస్ లో గ్లామర్ షోకు హద్దులు చెరిపేసింది. 

కల్పిక గణేష్ తాను సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ షోకు సిద్దమే అనే సంకేతాలు పంపుతోంది. కల్పిక చేస్తున్న ఈ గ్లామర్ ఫీట్లు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి.