మెగాస్టార్ చిరంజీవి ఘన నట వారసత్వాన్నందుకుని హీరోగా అరంగేట్రం చేసిన ఆయన తమ్ముడు కళ్యాణ్‌కు తొలి రెండు సినిమాలు ఓ మోస్తరు ఫలితాలనే అందించాయి. ఆ తర్వాత సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి లాంటి వరుస హిట్లు పవన్ రాతను మార్చేశాయి. అతను స్టార్ అయిపోయాడు. ఐతే తర్వాత చేసిన ఒక సినిమాతో ‘స్టార్’ నుంచి ‘సూపర్ స్టార్’ రేంజికి వెళ్లిపోయాడు పవన్ కళ్యాణ్.
అన్నయ్యకు తగ్గ తమ్ముడిగానే కాదు.. అన్నయ్యకు పోటీ కూడా ఇవ్వగలిగే హీరోగా పవన్‌ను నిలబెట్టిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా విడుదలై మంగళవారం నాటికి 20 ఏళ్లు పూర్తవడం విశేషం. ఐతే 20 ఏళ్ల ముందు సినిమా కదా.. ఇప్పటి యువతకు ఔట్ డేటెడ్ అనిపిస్తుందేమో అనుకుంటే పొరబాటే. ఇప్పటి కుర్రాళ్లు ఈ సినిమా చూసినా వెర్రెత్తిపోవడం ఖాయం. అంత ట్రెండీగా అనిపించే టైమ్ లెస్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఖుషి’.
టాలీవుడ్లో టాప్ బ్లాక్‌బస్టర్ల లిస్టు తీస్తే చాలా వరకు మాస్ సినిమాలే కనిపిస్తాయి. ప్రేమకథలు ప్రేక్షకులకు ఎంతగా నచ్చినా.. అవి క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంటాయి తప్ప ఇండస్ట్రీ హిట్ల రేంజికి వెళ్లవు. వసూళ్ల విషయంలో మాస్ సినిమాలతో పోలిస్తే వెనుకనే ఉంటాయి. కానీ ‘ఖుషి’ మాత్రం అందుకు మినహాయింపు. అవ్వడానికి ప్రేమకథే అయినా.. వసూళ్ల పరంగా ప్రభంజనమే సృష్టించిందీ చిత్రం.
2001 సంక్రాంతికి విడుదలై అసాధారణ విజయాన్నందుకుని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘నరసింహనాయుడు’కు దీటుగా ఈ సినిమా ఆడింది. 100 డేస్ సెంటర్స్, వసూళ్ల పరంగా ఆ సినిమాకు ‘ఖుషి’ దగ్గరగా వచ్చింది. ‘నరసింహనాయుడు’ లేకుంటే అప్పటికి ‘ఖుషి’నే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేది.
ప్రధానంగా ఇది ప్రేమకథే అయినా.. మాస్ ప్రేక్షకులను మురిపించే అంశాలకూ లోటుండదు. కాకపోతే ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాల్ని కూడా క్లాస్‌గా, స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడంలో ‘ఖుషి’ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇది రీమేక్ మూవీనే అయినా.. దీనికి పవన్ ఇచ్చిన టచ్ సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చింది. ఒరిజినల్‌ను మించి సినిమా ఆకర్షణీయంగా తయారైంది. అంతకుమించిన విజయాన్నందుకుంది.
ఈ సినిమా మేకింగ్‌లోనూ పవన్ పాత్ర కీలకం కావడం విశేషం. ఈ చిత్రంలో పవన్ మేనరిజమ్స్, స్టైలింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో అతను యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుని సూపర్ స్టార్ రేంజికి ఎదిగిపోయాడు.
This post was last modified on April 27, 2021 3:31 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…