అనుకున్న ప్రకటన రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ ఊహించినట్లే వాయిదా పడిపోయింది. మే 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ తేదీకి రాదని గత నెలలోనే సందేహాలు మొదలయ్యాయి. షూటింగ్ ఆలస్యం కావడమే అందుక్కారణం. మామూలుగానే షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంటే.. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ యూనిట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పూర్తిగా షూటింగ్ ఆపేయక తప్పలేదు.
అటు ఇటుగా ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగే పూర్తి కాలేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు మూత పడి ఉన్నాయి. కరోనా విలయం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఆచార్య’ను వాయిదా వేయడం మినహా మార్గం లేకపోయింది నిర్మాతలకు.
ఈ రోజో రేపో అధికారిక ప్రకటన వస్తుందనగా.. మంగళవారం నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఉమ్మడిగా తమ చిత్రం వాయిదా పడటంపై అధికారిక ప్రకటన ఇచ్చారు. అనివార్య పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నామని.. తర్వాత సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది పరిస్థితులను బట్టి, చర్చించి నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘ఆచార్య’కు సంబంధించి ఇంకో నెల రోజుల దాకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మే అంతటా కూడా షూటింగ్ జరిగే అవకాశాలు తక్కువే. జూన్‌లో మళ్లీ షూటింగ్ మొదలుపెడితే టాకీ పార్ట్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవగొట్టడానికి రెండు నెలలు పట్టొచ్చు. కాబట్టి ఆగస్టులో కానీ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవంటున్నారు. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ ఆగస్టు 13 నుంచి వాయిదా పడేట్లయితే ఆ తేదీని చిరు సినిమాకు వాడుకునే అవకాశం ఉంది.
This post was last modified on April 27, 2021 12:08 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…