Movie News

రాశి ఖన్నా కెరీర్లో వరస్ట్ టైం

హీరోయిన్‌గా చేసిన తొలి సినిమాలో ఢిల్లీలో ఉండే తెలుగమ్మాయిగా నటించింది రాశి ఖన్నా. వాస్తవానికి ఆమె హైదరాబాద్‌లో ఉంటున్న ఢిల్లీ అమ్మాయి కావడం విశేషం. హైదరాబా‌ద్‌లో సొంత ఇల్లు కూడా కొనుక్కుని ఇక్కడే స్థిరపడి పోవాలని నిర్ణయించుకుందామె. ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె ఫోకస్ తెలుగు సినిమాల మీదే ఉంది.

ఇక్కడి ప్రేక్షకుల అభిమానమే వేరు అంటున్న రాశి.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ గురించి మాట్లాడింది. ఒకప్పుడు రాశి కొంచెం లావుగా, బబ్లీగా కనిపించేదన్న సంగతి తెలిసిందే. అప్పుడు మీడియాతో పాటు అభిమానులు కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారని.. కానీ అప్పుడు తాను కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం వల్లే అలా లావుగా తయారయ్యానని రాశి చెప్పుకొచ్చింది. ఇదే తన కెరీర్లో వరస్ట్ ఫేజ్ అని కూడా చెప్పింది.

ఐతే తన బాడీ గురించి విమర్శలు మంచే చేశాయని.. పట్టుదలతో బరువు తగ్గాలని చూశానని రాశి తెలిపింది. ఐతే బరువు తగ్గేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలితాన్నివ్వలేదని.. తర్వాత ఎంతో కష్టపడి.. క్రమ పద్ధతిలో వ్యాయామాలు చేసి, ఆహార నియమాలు పాటించి బరువు తగ్గినట్లు రాశి వెల్లడించింది.

ఇక తెలుగులో చివరగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విషయంలో తాను రిగ్రెట్ అవుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. ఆ సినిమాలో తన పాత్ర గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని.. కచ్చితంగా ఆ సినిమా చేయాలని అనుకున్నానని.. ఐతే కొన్నిసార్లు పేపర్ ఉన్నంత ఎగ్జైటింగ్‌గా తెరపైకి పాత్రలు రాకపోవచ్చని.. ఎడిటింగ్‌లో తన సన్నివేశాలు కొన్ని పోవడం వల్ల కూడా ఆ పాత్రకు కొంత అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా తనకు మంచి పాఠం అని రాశి చెప్పింది.

This post was last modified on May 13, 2020 4:04 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

1 hour ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

1 hour ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

5 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago