టాలీవుడ్లో మళ్లీ గత ఏడాది పరిస్థితులే కనిపిస్తున్నాయి. థియేటర్లు మూత పడుతున్నాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ స్తబ్దత నెలకొంటోంది. స్టార్ హీరోలందరూ ఇంటికి పరిమితం అవుతున్నారు. షూటింగ్స్ ఆగిపోతుండటంతో వివిధ చిత్రాల బృందాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గత ఏఢాది లాగే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం జరగబోతోంది.
నిరుడు లాక్ డౌన్ టైంలోనే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసి అభిమానులను మురిపించాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ తన సినిమాల నుంచి ఏదో ఒక విశేషం పంచుకోవడం మహేష్‌కు అలవాటే. గత ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేసింది ఆ రోజే. ఇక ఈసారి కృష్ణ బర్త్ డేకి టీజర్‌తో పలకరించబోతున్నాడట మహేష్.
‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ను కొన్ని రోజుల కిందటే ఆపేసి ఇంటికి పరిమితం అయిపోయాడు మహేష్. ఇక దర్శకుడు పరశురామ్ అండ్ టీం ఇప్పటిదాకా షూటింగ్ జరిపినంత వరకు రష్ చూసుకుని ఎడిటింగ్ చేసుకోవడం, తర్వాత తీయబోయే సన్నివేశాలను సరి చూసకోవడం లాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మేలో కూడా షూటింగ్ జరగడం సందేహంగానే ఉండటంతో ‘సర్కారు వారి పాట’ టీజర్ రెడీ చేయడానికి బాగానే సమయం దొరికినట్లే.
ఇప్పటికే టీజర్ కోసం కాన్సెప్ట్ రెడీ అయిందని.. షూట్ చేసిన సన్నివేశాల నుంచి షాట్స్ తీసుకుని టీజర్ రెడీ చేయబోతున్నారని అంటున్నారు. కాబట్టి మే 31కి ‘సర్కారు వారి పాట’ ట్రీట్‌కు మహేష్ అభిమానులు రెడీ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్లాన్. కానీ కరోనా సెకండ్ వేవ్ ధాటికి చాలా సినిమాల షెడ్యూళ్లన్నీ మారిపోతుండటంతో కచ్చితంగా ఆ పండక్కే ఈ సినిమా వస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
This post was last modified on April 26, 2021 8:08 am
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…