అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘పుష్ప’ ఫస్ట్ లుక్ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఉదయం రిలీజైంది. బన్నీ లుక్ అదిరిపోయిందనే విషయంలో మరో మాట లేదు. ఈ విషయంలో అందరి నుంచి ఒకే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక టైటిల్ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
అమ్మాయి పేర్లతో మాస్ సినిమాలు గతంలోనూ వచ్చాయి కానీ.. ‘పుష్ప’ అనే పేరు మాత్రం కొంచెం అదోలా అనిపిస్తోంది. దీని మీద సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ కూడా నడుస్తోంది. కానీ రాను రాను ఈ టైటిల్ కూడా అలవాటైపోయిపోవచ్చు. ఐతే ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లందరికీ ఇప్పుడు మహేష్ బాబు గుర్తుకొస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ నటించి ఉంటే.. అతడికి ఈ లుక్ ట్రై చేసి ఉంటే ఎలా ఉండేది.. పుష్ప అనే టైటిల్ మహేష్‌కు పెడితే రెస్పాన్స్ ఎలాగుండేది అనే చర్చ నడుస్తోందిప్పుడు.
బన్నీతో సుక్కు చేస్తున్న ఈ సినిమాకు ముందు హీరోగా అనుకున్నది మహేష్ బాబునన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు కథా చర్చలు జరిగి.. ఇద్దరూ కలిసి ప్రయాణం సాగించాక కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. మహేష్ స్థానంలో బన్నీని తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ కథను పట్టాలెక్కిస్తున్నాడు సుక్కు. ఐతే మహేష్‌కు ఈ సినిమా విషయంలో ప్రధాన ఇబ్బంది మేకోవరే అని.. అందుకే ఈ సినిమా నుంచి వైదొలిగాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎంతైనా మహేష్ సుకుమారుడు. రఫ్ లుక్‌లోకి రావడం అంటే కష్టమే.
బన్నీలా గడ్డం పెంచి.. అతడిలా ఊర మాస్, నాటు లుక్‌లోకి రావాలంటే మహేష్‌కు కష్టమే. అతడి రంగుకి.. ముఖారవిందానికి ఎంత ట్రై చేసినా ఈ రోజు చూసిన తరహా లుక్‌లోకి రాలేడు. అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో మహేష్‌ను ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక మహేష్ హీరోగా ‘పుష్ప’ అనే టైటిల్ పెట్టి ఉంటే ఇక అంతే సంగతులు. బన్నీని మించిన ట్రోలింగ్ ఎదుర్కొనేవాడు. యాంటీస్ చెలరేగిపోయి ఉండేవారు. కాబట్టి ఈ సినిమా నుంచి మహేష్ తప్పుకోవడం అతడికి, సుక్కుకు ఇద్దరికీ మంచిదే అని భావించాలి.
This post was last modified on April 9, 2020 6:31 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…