అల్లరి అమ్మాయిగా తెలుగు వెండితెరపై జెనీలియా చేసిన సందడి అంతా ఇంతా కాదు. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు, రెడీ, ఢీ లాంటి చిత్రాలు మదిలో మెదులుతాయి. వివాహం తర్వాత జెనీలియా ముంబైలో సెటిల్ అయింది. సినిమాలకు దూరమై మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.
గత కొన్ని రోజులుగా జెనీలియా రీఎంట్రీ గురించి ప్రచారం జరుగుతోంది. మంచి అవకాశం వస్తే తిరిగి నటించాలనే ఆలోచనలో జెనీలియా కూడా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీనితో టాలీవుడ్ లో ఆమెకు ఉన్న ఫేమ్ దృష్ట్యా ఇప్పటికే కొంతమంది నిర్మాతలు, దర్శకులు సంప్రదింపులు మొదలుపెట్టారట.
హీరో రామ్ పోతినేని, జెనీలియా మధ్య మంచి స్నేహం ఉంది. తిరిగి నటించాలని రామ్ కూడా జెనీలియాకు సలహాలు ఇస్తుంటాడట. అయితే జెనీలియా రీఎంట్రీ గురించి ప్రచారం అవుతున్న ఓ వార్త అభిమానులని స్వీట్ షాక్ కు గురిచేస్తోంది. రామ్ తదుపరి చిత్రాల్లో ఓ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్.
సాధారణంగా పెళ్లి చేసుకుని గ్యాప్ తీసుకున్న హీరోయిన్లు రీఎంట్రీలో వదిన, అక్క తరహా పాత్రలకు పరిమితమవుతారు. చాలా తక్కువమందికి మాత్రమే హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కుతుంది. మరి జెనీలియాని రామ్ హీరోయిన్ గా రికమండ్ చేస్తాడేమో చూడాలి.
రెడీ చిత్రంతో వీరిద్దరూ సూపర్ హిట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శత్వంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి జెనీలియాకు నిజంగానే రామ్ సరసన హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందా.. వస్తే ఏ చిత్రంలో నటించనుంది అనేవి ఇప్పటికైతే ప్రశ్నలే.
This post was last modified on April 24, 2021 11:24 am
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…