తెలుగులో భారీ సినిమాలు ఎక్కువగా టార్గెట్ చేసేది సంక్రాంతి సీజన్‌నే. ఇంకే సీజన్లోనూ లేని సినిమా మూడ్ జనాల్లో అప్పుడే ఉంటుంది. ఇంకెప్పుడూ రానన్ని వసూళ్లు అప్పుడు వస్తుంటాయి. అందుకే వేరే సినిమాలతో పోటీ ఉన్నా సరే.. సంక్రాంతికే తమ సినిమాను రిలీజ్ చేయాలని భారీ చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు భారీ వసూళ్లు రావడంతో సంక్రాంతి మీద మరింత గురి కుదిరింది. దీంతో చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసుకునే పనిలో పడ్డారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి తన కొత్త సినిమాను తీసుకెళ్లి సంక్రాంతి రేసులో నిలబెట్టేశాడు.
ఈ ఏడాది జులై 30న రావాల్సిన ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జక్కన్న ఇచ్చిన షాక్‌తో కొందరు స్టార్ హీరోలు, బడా నిర్మాతలకు దిమ్మదిరిగిపోయింది. దీంతో వాళ్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఆ సీజన్లో కొంచెం రేంజ్ ఉన్న సినిమాలే మూడు రిలీజ్ చేసుకునే అవకాశముండేది. కానీ ఆర్ఆర్ఆర్‌కు ఎదురెళ్లడం ఎందుకని ఆగిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వేసవి, ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలకు కరోనా రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది.
ఈ నెలల్లో షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఇప్పుడిక వాటికి మిగిలిన మంచి సీజన్ అంటే.. దసరా-దీపావళి మధ్య కాలమే. కానీ ఆ సీజన్లో మహా అయితే మూడో నాలుగో సినిమాలు రిలీజ్ చేయొచ్చు. మిగతా వాటి పరిస్థితేంటి? కాస్త వెనక్కి వెళ్లి సంక్రాంతికి ట్రై చేద్దామంటే అక్కడ రాజమౌళి సినిమా ఉంది. దీంతో ఇంకా ముందుకెళ్లి వేసవిని టార్గెట్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే సీజన్‌కు విపరీతమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 9, 2020 6:30 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…