పోయినేడాది మార్చి నుంచి భారతీయ సినిమాకు కరోనా గ్రహణం పట్టుకుంది. దీన్నుంచి వేరే ఇండస్ట్రీలు కొంచెం కోలుకున్నాయి కానీ.. బాలీవుడ్ మాత్రం ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. గత డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభయం అయ్యాక.. సంక్రాంతి నుంచి తెలుగు సినిమాలు బాగానే ఆడాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అనివార్య పరిస్థితుల్లో థియేటర్లు మూత పడ్డాయి.
మిగతా ఇండస్ట్రీలు కూడా గత కొన్ని నెలల్లో కొంతమేర పుంజుకుని ఇప్పుడు షట్ డౌన్ అవుతున్నాయి కానీ.. హిందీ సినిమాలు మాత్రం ఎప్పుడూ కుదురుకున్నది లేదు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. హిందీ సినిమాలకు కేంద్ర స్థానం అయిన మహారాష్ట్ర కరోనాతో ఎలా అల్లాడిపోతోందో తెలిసిందే. సమీప భవిష్యత్తులో అక్కడ పరిస్థితులు మారతాయన్న ఆశ లేదు. అయినా సరే.. సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం ‘రాధె’ను విడుదలకు సిద్ధం చేయడం విశేషం.
‘రాధె’ను రంజాన్ కానుకగా మే 13న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చిత్రాన్ని వాయిదా వేయడం అనివార్యం అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా మే 13నే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గురువారం ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో థియేటర్లలో సినిమా ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఐతే ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిత్ర బృందం.
సినిమాను థియేటర్లతో పాటు నేరుగా టీవీల్లోనూ ఆడించనున్నారు. జీ ప్లెక్స్, జీ5లతో పాటు కొన్ని డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో చూసే అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ రేటు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ థియేటర్లకు బిగ్ స్క్రీన్ మీద సల్మాన్‌ను చూడాలనుకునే వాళ్లు అక్కడికి వెళ్లొచ్చు. లేదంటే ఇంటి పట్టునే ఉండి డబ్బులు కట్టి సినిమా చూడొచ్చన్నమాట. ఈ పద్ధతి సక్సెస్ అయితే మున్ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాలు ఈ బాట పట్టొచ్చేమో.
This post was last modified on April 21, 2021 9:08 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…