ల్లు అర్జున్ కెరీర్ ఎదుగుదలలో నిర్మాత దిల్ రాజు పాత్ర అత్యంత కీలకం. బన్నీ తొలి సినిమా ‘గంగోత్రి’ బాగా ఆడినా.. అతడికి అంత మంచి పేరేమీ రాలేదు. హీరోగా అతను నిలదొక్కుకుంటాడన్న నమ్మకాలేమీ కలగలేదు. అలాంటి సమయంలో బన్నీని, అలాగే కొత్త దర్శకుడైన సుకుమార్‌ను నమ్మి మంచి బడ్జెట్లో, రాజీ లేకుండా ‘ఆర్య’ సినిమాను నిర్మించాడు రాజు. ఆ సినిమాతో ఆ ఇద్దరి కెరీర్లు ఎలా మలుపు తిరిగాయో తెలిసిందే.
ఈ సినిమాతో నిర్మాతగా రాజు కెరీర్‌కు గొప్ప ప్రయోజనమే దక్కింది కానీ.. అప్పటికే రాజు నిలదొక్కకున్నాడు కాబట్టి ఆయనే బన్నీ, సుకుమార్‌లకు లైఫ్ ఇచ్చాడని చెప్పాలి. ఆ తర్వాత బన్నీతో.. పరుగు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు తీశాడు రాజు. తన కెరీర్ ఎదుగుదల తాలూకు క్రెడిట్‌ను సుకుమార్‌కు ఎంత ఇస్తాడో రాజుకు కూడా అంతే ఇవ్వాలి బన్నీ. ఐతే ఈ మధ్య బన్నీ తనను ఇబ్బంది పెడుతుండటం పట్ల రాజు కొంత అసంతృప్తితో ఉన్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తన ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయడానికి ఒప్పుకుని ఎంతకీ ఆ సినిమాకు డేట్లు ఇవ్వకపోవడం, ఏ విషయం తేల్చకపోవడం దిల్ రాజుకు నచ్చట్లేదని తెలుస్తోంది. ఎప్పుడు అడిగినా చూస్తా, చేస్తా అంటున్నాడే తప్ప ఏదీ కచ్చితంగా చెప్పట్లేదట బన్నీ. మొన్న ప్రెస్ మీట్లో భాగంగా త్వరలోనే తమ బేనర్లో ‘ఐకాన్’ సినిమా మొదలవుతుందని రాజు చెప్పగా.. ఆ తర్వాత కూడా బన్నీ నుంచి స్పందన లేదట.
తనకు కథ నచ్చకపోయినా, లేక డేట్ల సమస్య ఉన్నా ఆ విషయం చెప్పాలి కానీ, ఇలా ఏదీ తేల్చకపోవడం ఏంటి అన్నది రాజు ప్రశ్న. ఈ నేపథ్యంలోనే తనకు నచ్చిన కథను బన్నీతో కాకపోయినా వేరే హీరోతో అయినా చేసేద్దామని రాజు నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. బన్నీ పట్ల రాజు అసంతృప్తితో ఉన్నాడనడానికి.. ‘ఐకాన్ స్టార్’ కామెంట్ కూడా ఒక నిదర్శనం. బన్నీకి ఈ టైటిల్ ఇచ్చింది మీరే కదా అని విలేకరులు అంటే.. ‘‘అది ఆయనే పెట్టుకున్నాడు’’ అంటూ రాజు ఒకింత వ్యంగ్యంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on April 21, 2021 1:38 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…