ఊర్వశి రౌటలా.. ఏమంత పెద్ద హీరోయిన్ కాదు. బాలీవుడ్లో చిన్నా చితకా పాత్రలే చేసింది. ఎక్కువగా ఐటెం సాంగ్స్‌తో పాపులర్ అయింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి చాలా పాపులరే. హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు వెర్రెత్తిస్తుంది. ఐతే కథానాయికగా ఆమె స్థాయి చాలా తక్కువైనా.. కరోనా బాధితుల కోసం ఆమె చాలా పెద్ద సాయమే చేసింది.
కోవిడ్-19 బాధితుల ఏకంగా రూ.5 కోట్ల విరాళాన్ని ఊర్వశి అందజేసి షాకిచ్చింది. సోషల్ మీడియాలో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ భామ.. టిక్ టాక్‌లో మాస్టర్ డ్యాన్స్ క్లాస్ పేరుతో ఓ ఆన్ లైన్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనికి 18 మిలియన్ల మంది కనెక్టయ్యారు. తద్వారా రూ.5 కోట్ల మొత్తం పోగైంది. ఆ మొత్తాన్ని ఆమె ప్రభుత్వానికి అందజేసింది.
కరోనా పోరులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు కానీ.. హీరోయిన్ల నుంచి పెద్దగా స్పందన లేకపోయింది. కోట్లల్లో అయితే ఎవరూ విరాళాలు అందజేసినట్లు వార్తలు రాలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఇదే వరస. కొందరు కొన్ని లక్షల మేర విరాళాలు అందజేశారు. వేరే సహాయ కార్యక్రమాలేవో చేశారు. కానీ ఊర్వశి లాంటి చిన్న కథానాయికగా ఏకంగా రూ.5 కోట్ల విరాళం ఇవ్వడం అసాధారణమైన విషయం. ఈ విషయంలో తనకు సహకారం అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
కథానాయికగా పెద్ద రేంజ్ లేకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లుండటం విశేషం. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లోనూ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఎండోర్స్‌మెంట్లతో ఊర్వశి బాగానే ఆర్జిస్తోంది. ఆమె ఒక పోస్ట్ పెడితే కోట్లమందికి చేరుతుందంటే ఎండోర్స్‌మెంట్లకు ఢోకా ఏముంటుంది?
This post was last modified on May 13, 2020 11:44 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…