ఈపాటికి మామూలుగా అయితే ‘లవ్ స్టోరి’ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఈ సినిమా థియేటర్లలోకి దిగి ఐదు రోజులు అవుతుండాలి. అలాగే ఇంకో మూడు రోజుల్లో ‘టక్ జగదీష్’ విడుదలకు ముస్తాబవుతుండాలి. దాని గురించి కూడా తెలుగు ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ ఆ ప్రణాళికలన్నింటినీ దెబ్బ తీసేసింది. ‘లవ్ స్టోరి’తో పాటు ‘టక్ జగదీష్’ చిత్రాలను వాయిదా వేయించింది. నెలాఖర్లో రావాల్సిన ‘విరాట పర్వం’ సైతం వాయిదా పడక తప్పలేదు.
ఈ చిత్రాలు ఇలా వాయిదా పడ్డాయో లేదో.. ఇదే మంచి ఛాన్స్ అంటూ కొన్ని చిన్న సినిమాలు రేసులోకి వచ్చేశాయి. హడావుడిగా వాటి రిలీజ్ డేట్లు ప్రకటించేశారు. మామూలుగా వేసవిలో చిన్న సినిమాలకు రిలీజయ్యే అవకాశమే ఉండదు. పెద్ద సినిమాలే ఈ సీజన్‌ను ఫుల్లుగా వాడేసుకుంటాయి. చిన్న చిత్రాలను వీలైనంత వరకు ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే రిలీజ్ చేసేస్తుంటారు. లేదంటే వేసవి అయ్యాక చూసుకుంటారు.
కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పేరున్న సినిమాలు వాయిదా పడటంతో ఆర్జీవీ ‘దెయ్యం’తో పాటు ‘99 సాంగ్స్’, ‘ఇష్క్’, ‘ఏక్ మినీ కథ’, ‘థ్యాంక్ యు బ్రదర్’ లాంటి చిత్రాలు విడుదలకు ముస్తాబైపోయాయి. వీటిలో తొలి రెండు సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియదు. వాటికి అస్సలు బజ్ లేని మాట కూడా వాస్తవం. ఇక హడావుడిగా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన ఇష్క్, ఏక్ మిని కథ, థ్యాంక్ యు బ్రదర్ సినిమాల పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఈ మూడు చిత్రాల ప్రోమోలైతే ఆసక్తికరంగానే అనిపించాయి. వేరే సమయాల్లో వీటికి మంచి టాక్ వస్తే బాగా ఆడునేమో. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి జనాల మూడ్ మారిపోయింది. మళ్లీ ఒకప్పటి కరోనా భయం కనిపిస్తోంది.
థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితుల్లో కనిపించట్లేదు. పైగా ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం, నైట్ కర్ఫ్యూ లాంటి షరతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు వెలవెలబోతాయేమో అనిపిస్తోంది. సమ్మర్లో మంచి డేట్లు దొరికాయన్న చిన్న సినిమాల సంబరం ఏమో కానీ.. అనవసరంగా తమ సినిమాలను రిలీజ్ చేశాం అని వీటి మేకర్స్ చింతించాల్సి వస్తుందేమో అనిపిస్తోంది.
This post was last modified on April 20, 2021 2:19 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…