ఈ నెల 9వ తేదీన విడుదలైన ‘వకీల్ సాబ్’కు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ కూడా ఓ రేంజిలో ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టడం విశేషం. వీకెండ్ అయ్యాక కూడా ‘వకీల్ సాబ్’ బాగానే నిలబడ్డట్లు కనిపించింది. సోమవారం వసూళ్లు తగ్గినా.. ఆ తర్వాతి రెండు రోజులు ఉగాది, అంబేద్కర్ జయంతి సెలవులు కలిసి రావడంతో వీకెండ్‌కు దీటుగా వసూళ్లు వచ్చాయి.
గత వారాంతంలో విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరి’ వాయిదా పడటంతో ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ దగ్గర పండుగ చేసుకుంటాడని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. రెండో వీకెండ్‌ను ఈ సినిమా పెద్దగా ఉపయోగించుకున్నట్లుగా కనిపించడం లేదు. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజారిటీ థియేటర్లలో ఆడిస్తుండటంతో తొలి వారం రోజుల్లో మాగ్జిమం ఆడియన్స్ చూసేశారు.
మాస్ సినిమా అయితే ప్రేక్షకులు గట్టిగా రిపీట్స్ వేసేవాళ్లేమో కానీ.. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో అది పెద్దగా జరగలేదు. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనాల్లో మళ్లీ భయం మొదలైంది. దీంతో ‘వకీల్ సాబ్’ వసూళ్లు బాగా పడిపోయాయి. రెండో వీకెండ్లో అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా పెర్ఫామ్ చేయలేకపోయింది.
ఇక ఈ సోమవారం అయితే సినిమా పూర్తిగా చల్లబడిపోయినట్లే కనిపిస్తోంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ నామమాత్రంగా నడుస్తున్నాయి. ఇక సినిమా రన్ దాదాపు చివరి దశకు వచ్చేసినట్లే అని భావిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ జోరు తగ్గిపోవడం.. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరగడం, పైగా టికెట్ల మీద నియంత్రణ నడుస్తుండటంతో ఏపీలో చాలా చోట్ల షోలు ఆపేసి థియేటర్లనే మూసేస్తున్నారు. తెలంగాణలో కూడా థియేటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు.
This post was last modified on April 20, 2021 2:22 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…